Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. ఏ ముహూర్తంలో ఆయన ‘వారాహి విజయ యాత్ర’ ప్రారంభించాడో కానీ, అప్పటి నుండి అధికార వైసీపీ పార్టీ కి వెన్నులో వణుకుపుట్టడం ప్రారంభం అయ్యింది. పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు వైసీపీ మంత్రులు – ఎమ్యెల్యేలు సమాధానం చెప్పలేక , మాట మారుస్తూ కౌంటర్లు ఇస్తున్నారు.
తాజాగా జరిగిన ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ కాగ్ ఇచ్చిన రిపోర్ట్స్ ని సభలో మాట్లాడుతూ వైసీపీ కాజేసిన సొమ్ము గురించి చెప్పుకొచ్చాడు. వీటికి సమాధానం చెప్పే ధైర్యం లేక, వాలంటీర్ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ, నిరసన తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో ధర్నాలు చేయిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వీరమహిళలతో సమావేశం ఏర్పాటు చేసాడు.
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో అభిమానుల చేత కంటతడి పెట్టిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ ‘వైసీపీ నాయకులూ చేసే నీచమైన కామెంట్స్ కి మా భార్య ఎన్నో సార్లు ఏడ్చింది కూడా, నేను ఏమి చెప్పగలను ఆమెకి?, బాధ్యత తీసుకున్నాను వెనక్కి రాలేను, ఉంటే ఉంటాను పోతే పోతాను, నా వల్ల మాటలు పడుతున్నందుకు దయచేసి క్షమించు’ అని చెప్పాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇంకా వాలంటీర్ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందిస్తూ ‘వాలంటీర్లు తమ మనోభావాలు దెబ్బ తిని నా దిష్టి బొమ్మలను తగలబెడుతున్నారు అని తెలిసింది. సంతోషం ఏమి చేసుకుంటారో చేసుకోండి, మీకు అంతలా కోపం కలిగింది అంటే అందులో నిజం ఉండబట్టే కదా, తప్పు జరుగుతున్నట్టే కదా’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
వీలు అనే మాటలకు నా భార్య ఏడుస్తుంది 😒🥺🥺@JanaSenaParty @PawanKalyan #HelloAP_ByeByeYCP#VarahiVijayaYatra pic.twitter.com/WpYpJWzCtp
— Prasannakumar Nalle (@PrasannaNalle) July 11, 2023