Pawan Kalyan Vs Jagan: రాష్ట్రంలో వలంటీర్లు బలమైన వ్యవస్థ. దానికి అంతలా శక్తినిచ్చి రాజకీయ సమాంతర వ్యవస్థగా మార్చుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. తన గెలుపునకు అపర సంజీవినిగా వలంటీరు వ్యవస్థ పనిచేస్తుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే తనకు తిరుగులేదని తరచూ చెబుతుంటారు. వైనాట్ 175 అన్న స్లోగన్ కూడా అందులో భాగమే. అయితే ఎవరి నమ్మకాలు వారివి. ఈ విషయంలో అంతలా జగన్ కు నమ్మకం కుదరడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే కారణం. వలంటీర్ల ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో అధికార పార్టీ సక్సెస్ అయ్యింది. అందుకే ఆ ఎన్నికల్లో విపక్షాలకు స్పేస్ లేకుండా పోయింది.
ఎటువంటి నిర్ణయాన్నైనా వలంటీర్ వ్యవస్థ ద్వారా అమలుచేసే టెంపరితనాన్ని జగన్ సొంతం చేసుకున్నారు. దానికి చక్కటి ఉదాహరణ తన సాక్షి పత్రిక సర్వ్యూలేషన్ పెంచుకోవడమే. సాధారణంగా డిజిటల్ మీడియా రాజ్యమేలుతున్న తరుణంలో అన్ని పత్రికలకు పాఠకులు తక్కువయ్యారు. రోజురోజుకూ పత్రికల చందాదారులు తగ్గిపోతున్నారు. అందుకే అన్ని పత్రికల సర్వ్యూలేషన్ అమాంతంగా పడిపోతోంది. ఈ తరుణంలో సాక్షి సర్క్యూలేషన్ ను ఎటువంటి ప్రమోషన్ వర్క్ చేయకుండా రెండున్నర లక్షల కాపీలను ఒకేసారి పెంచేశారు. వలంటీర్లు విధిగా సాక్షి పేపరు కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇందుకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతినెలా జీతంతో పాటు రూ.250లను విడుదల చేస్తున్నారు. చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వం నుంచి నేరుగా సాక్షి ఖాతాకు డబ్బులు జమ చేస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ ఇటువంటి ఆలోచనలకు జగన్ పదును పెడతారు. అందుకు వలంటీరు వ్యవస్థను వాడుకుంటారు. ఇది జగమెరిగిన సత్యం. విశ్లేషకులు సైతం ఇదే హెచ్చరిస్తున్నారు. సాక్షాత్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు హెచ్చరిస్తున్నా.. వద్దని మొర పెట్టుకున్నా జగన్ పెడచెవిన పెడుతూ వచ్చారు. వలంటీర్లకు ప్రాధాన్యత పెంచుతునే ఉన్నారు. వారికి సన్మానాలు, సత్కారాలు పేరిట వారిని అభిమానులుగా మార్చుకుంటున్నారు. కట్టప్ప వల్లే కట్టుబానిసలుగా ట్రీట్ చేస్తున్నారు. కానీ ఈ విషయం అన్ని పార్టీల నాయకులకు తెలుసు. వలంటీర్ల వ్యవస్థ ప్రమాదకరమని తెలుసు. కానీ ఏమీ అనలేని నిస్సహాయతతో ఉన్నారు.
నీ విజయానికి, అపజయానికి మధ్య నేనుంటాను అని పవన్ పదేపదే జగన్ ను హెచ్చరిస్తూ వస్తున్నారు. అన్నింటినీ గాడిలో పెడతానని కూడా చెబుతూ వచ్చారు. సరిగ్గా అదునుచూసి వలంటీరు వ్యవస్థపై కొట్టారు. సామాజిక రుగ్మతగా చూపే ప్రయత్నం చేశారు. ప్రతీ నాయకుడ్ని, ఆడపిల్లల తల్లిదండ్రులను అలెర్ట్ చేశారు. ఈ వ్యవస్థ ఎంత ప్రమాదకరమైనదో స్పష్టం చేశారు. వలంటీరు అంటే ఓ నిరుద్యోగ యువకుడి కోణంలో చూసిన పవన్… వలంటీర్ల సమోహాన్ని మాత్రం జగన్ సైన్యంగా పరిగణించారు. అందుకే ఆ వ్యవస్థ ద్వారా జగన్ ఆడుతున్న నాటకాన్ని బ్రేక్ చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ కుఠిల ఆలోచనలను బయటపెట్టారు. డిస్ట్రబ్ చేశారు.