Pawan Kalyan: ద్వారంపూడిపై పవన్ కళ్యాణ్ రివేంజ్.. గట్టి షాక్ లగా

వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాకినాడ సిటీ నుంచి తనపై పోటీ చేసి గెలవాలని కూడా ద్వారంపూడి సవాల్ చేశారు.

Written By: Dharma, Updated On : July 3, 2024 4:51 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: వైసిపి ప్రభుత్వ హయాంలో దూకుడు గల నేతల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. కాకినాడ సిటీ నుంచి వరుసగా గెలుపొందుతూ వచ్చిన ఆయన ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. విపక్షాలపై విరుచుకు పడడంలో ముందుండేవారు. ముఖ్యంగా కాకినాడ తీరాన్ని కేంద్రంగా చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ పై చంద్రశేఖర్ రెడ్డి నిత్య విమర్శలు చేసేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో జనసైనికులపై కేసులతో ఉక్కు పాదం మోపారు. దీంతో పవన్ వారాహి యాత్రలో ద్వారంపూడిని టార్గెట్ చేసుకున్నారు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చివేస్తానని హెచ్చరించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో పవన్ అన్నంత పని చేస్తున్నారు.

వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాకినాడ సిటీ నుంచి తనపై పోటీ చేసి గెలవాలని కూడా ద్వారంపూడి సవాల్ చేశారు. ఈ సవాల్ ను స్వీకరించినంత పని చేశారు పవన్. దీంతో అంత పవన్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారని ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ కాకినాడ పార్లమెంట్ స్థానం పరిధిలోని పిఠాపురం నుంచి పోటీ చేశారు పవన్. ఆ ప్రభావం కాకినాడ సిటీపై కూడా పడింది. ద్వారంపూడిపై కూటమి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు. పవన్ తాను అనుకున్నది సాధించారు. ద్వారంపూడిని దారుణంగా ఓడించారు.

అయితే ఇప్పుడు కాకినాడ తీరం వేదికగా జరుగుతున్న బియ్యం మాఫియా పై ప్రత్యేకంగా దృష్టి సారించారు పవన్. పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉండడంతో ఆయన నిత్య తనిఖీల పేరుతో హల్ చల్ చేస్తున్నారు. అధికారులను పరిగెత్తిస్తున్నారు. ఇప్పటివరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో 12 గోడౌన్లలో తనిఖీలు జరిపి రూ.43.43 కోట్ల విలువైన 15,396 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 9 కేసులు నమోదు చేశారు. కాకినాడ తో పాటు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం దిగుమతి అవుతోంది. ఇక్కడున్న కొన్ని రైస్ మిల్లులో వాటిని నూకలుగా మార్చి పోర్టు ద్వారా ఎగుమతి చేసే వారికి అందజేస్తున్నారు. అయితే ఇదంతా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసుకొని చేస్తున్నదేనని ప్రచారం జరుగుతోంది.