https://oktelugu.com/

OTT : నాని ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్.. ఓటీటీలో నేచురల్ స్టార్ లేటెస్ట్ మూవీ

హీరో నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్స్ లో విడుదలై నెల రోజులు గడవక ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మరి ఈ చిత్రాన్ని ఎక్కడ చూడొచ్చు..

Written By:
  • S Reddy
  • , Updated On : September 22, 2024 2:33 pm
    Sraipodha Shanivaram

    Sraipodha Shanivaram

    Follow us on

    OTT : వరుస విజయాలతో జోరుమీదున్నాడు హీరో నాని. ఆయన గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్న హిట్ స్టేటస్ అందుకున్నాయి. ఇటీవల సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సరిపోదా శనివారం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదలైంది. నాని ఓ డిఫరెంట్ రోల్ చేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకుడు. వీరి కాంబోలో గతంలో అంటే సుందరానికీ చిత్రం తెరకెక్కింది. అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

    వివేక్ ఆత్రేయ డైరెక్షన్ పై నమ్మకంతో నాని మరో ఛాన్స్ ఇచ్చాడు. నానికి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. ఎస్ జే సూర్య మెయిన్ విలన్ రోల్ చేశాడు. సరిపోదా శనివారం చిత్రానికి ఎస్ జే సూర్య నటన హైలెట్ గా నిలిచింది. క్రూయల్ పోలీస్ గా ఎస్ జే సూర్య జీవించాడు. నాని సైతం తన సహజ నటనతో సూర్యకు పోటీ ఇచ్చాడు.

    సరిపోదా శనివారం విడుదలైన వెంటనే తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. అది వసూళ్ల పై ప్రభావం చూపింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా పూర్తి స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంలో ఫెయిల్ అయ్యింది. సరిపోదా శనివారం థియేట్రికల్ రన్ ముగియగా.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం చేశారు. నాని మూవీ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

    తెలుగుతో పాటు మిగతా భాషల్లో సెప్టెంబర్ 26 నుండి మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది. సరిపోదా శనివారం మూవీ కథ విషయానికి వస్తే … సూర్య(నాని)కి చిన్నప్పటి నుండి కోపం ఎక్కువ. తన కోపాన్ని తల్లి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆమె అనుకోకుండా క్యాన్సర్ బారిన పడుతుంది. దాంతో కొడుకుకి ఉన్న అతి కోపం వలన ఎలాంటి ఇబ్బందుల్లో పడతాడో అని ఆవేదన చెందుతుంది.

    ఆమె చనిపోయే ముందు సూర్య వద్ద ఒక మాట తీసుకుంటుంది. నీకు ప్రతిరోజూ కలిగే కోపాన్ని మొత్తం ఒకరోజులో తీర్చుకో. ఒక్క రోజు మాత్రమే నీవు కోపం ప్రదర్శించాలని సూర్య వద్ద తల్లి మాట తీసుకుంటుంది. మరోవైపు ఎస్ ఐ దయానంద్(ఎస్ జే సూర్య) సోకులపాలెం జనాలను చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు. దయానంద్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేసే చారులత(ప్రియాంక మోహన్)కి హింస అంటే నచ్చదు. దయానంద్ అకృత్యాలకు చెక్ పెట్టాలి అనుకుంటుంది. అందుకు సూర్య సహాయం తీసుకుంటుంది. వీరిద్దరూ కలిసి దయానంద్ ని ఎలా ఎదుర్కొన్నారు అనేది కథ…