Pawan Kalyan : సమకాలీన అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) తనదైన రీతిలో స్పందిస్తుంటారు. అయితే తాజాగా కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నెలో ఓ చిన్నారిపై అఘాయిత్యం పై స్పందించారు పవన్ కళ్యాణ్. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. మరోవైపు ఈ ఘటన పెద్దగా వెలుగులోకి రాకపోవడం వెనుక అనేక రకాల కారణాలు ఉన్నాయి. ప్రధాన మీడియా సైతం దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. నటి పూనమ్ కౌర్ ఈ ఘటనపై స్పందించారు. మీడియా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పాలకులు స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటన చేశారు. అయితే పవన్ జాప్యం చేయడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
Also Read : సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
* మద్యం మత్తులో ఘాతుకం..
కడప ( Kadapa )జిల్లా మైలవరం మండలంలో కంబాలదిన్నె గ్రామానికి చెందిన పక్క గ్రామానికి చెందిన దూదేకుల రహమతుల్లా మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకం బయటకు రాకూడదనే కారణంతో బాలికను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం అంటూ ప్రశ్నించారు. యావత్ సమాజం తలదించుకునేలా అకృత్యానికి పాల్పడిన నరరూప మృగాలను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆలస్యంగా స్పందించడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
* సమీప బంధువే నిందితుడు..
వాస్తవానికి నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే సంబంధిత బాలిక సమీప బంధువే నిందితుడు కావడంతో.. ఈ ఘటన నీరుగారిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నానని పేర్కొన్నారు. అయితే పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతుండడం చూస్తుంటే.. చట్టం నుంచి తప్పించుకోవచ్చు అనే భావన నిందితుల్లో నెలకొని ఉండడమే కారణం కావచ్చు అని భావించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ఎప్పటికీ పోలీసులు అరెస్టు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయం పుట్టేలా ఉండాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు సైతం ప్రత్యేకంగా విన్నవించారు పవన్ కళ్యాణ్. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నిందితులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేశారు పవన్. అయితే పవన్ ఆలస్యంగా స్పందించడం పై మాత్రం భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.