Mock Drill: పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో మే 29 న మాక్ డ్రిల్ నిర్వహించేందుకు భారత్ ప్రభుత్వం సిద్ధమైంది. గుజరాత్, పంజాబ్ పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ లోని ఆయా జిల్లాల్లో అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరుపై స్థానికులకు అవగాహన కల్పించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సరిహద్దు రాష్ట్రాలకు కేంద్రం సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.