Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Emotional Comments: తనలో బాధను బయటపెట్టిన పవన్!

Pawan Kalyan Emotional Comments: తనలో బాధను బయటపెట్టిన పవన్!

Pawan Kalyan Emotional Comments: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసు తెరిచి మాట్లాడారు. రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయన పార్టీ శ్రేణులతో మమేకమై అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు. ముఖ్యంగా కాపుల పరంగా తనపై జరుగుతున్న రాజకీయ దాడిని ప్రస్తావించారు. సీఎం చంద్రబాబుకు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై లేని ఈ కుల బాధ తన విషయంలో ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను ఒక కులం కోసమే పార్టీ ఏర్పాటు చేయలేదని.. అన్ని కులాల కోసం పనిచేసే గుణం తనది అని చెప్పుకున్నారు. మరి ఎందుకు ఒక్క కాపు కులం లోనే తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా ఈ బాధ అనుభవిస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు బయట పెడుతున్నట్లు తెలిపారు. ఇతర కులాల్లో నాయకులు ఉన్నారని.. మరి ఎందుకు ఒక కులంలో కులం పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

* వారికి లేనిది తనకే..
కులం పేరుతో జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా రెడ్డి సామాజిక వర్గం వారు ప్రశ్నించారా అంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్. ఒక్క రెడ్డి సామాజిక వర్గం నేతైనా తన పేరు మార్చుకున్నారా? అంటూ పరోక్షంగా ముద్రగడ పద్మనాభం ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకున్న విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేశారు. పోనీ చంద్రబాబును సొంత కులం వారు ఓడించాలని చూశారా? కనీసం ఆ సామాజిక వర్గం నేతలు కుల ప్రస్తావన తీసుకొస్తున్నారా? చంద్రబాబు ఓడిపోతే పేరు మార్చుకుంటామని ఎవరైనా చెప్పారా అంటూ.. ఆలోచనకర రీతిలో మాట్లాడారు పవన్ కళ్యాణ్. కేవలం తనను ఒక కుల నాయకుడిగా ముద్ర వేసి ఇతర కులాలను దూరం చేయాలన్న ఎత్తుగడ మంచిది కాదు అని బాధపడ్డారు పవన్.

* కులం పేరుతో రాజకీయం..
పవన్ కళ్యాణ్ కోసం కులమంతా బాధ పడుతుందని.. ఆయన సీఎం కావాలని కులం కోరుకుంటే ఆయన మాత్రం కావడం లేదని కొందరు కాపు నేతలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తీరుతో కాపులు చాలా మోసపోతున్నారని అంబటి లాంటివారు బాధపడుతుంటారని.. వారి బాధ కాపుల కోసమా.. లేకుంటే వారి కోసమా అని ప్రశ్నించారు. వంగవీటి మోహన్ రంగా బతికి ఉన్నప్పుడు కనీసం పలకరించేవారు కాదని.. ఆయన చనిపోయిన తరువాత తమ వాడంటే తమ వాడు అని.. ఆయనను హత్య చేసింది ఒక సామాజిక వర్గం వారు అని ఆరోపణలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కానీ రంగా గారి భార్య, పిల్లల వైవాహిక జీవితంలో కుల ప్రస్తావన లేదు అని గుర్తు చేశారు. మొత్తానికి అయితే పవన్ తన 12 సంవత్సరాల కుల బాధను బయటపెట్టారు. ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Ranganath Controversy

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...
Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...
Oktelugu Epaper