Sushmita Sen: ముఖ్యంగా అభిమానులు హీరోయిన్ల ప్రేమయనం, రిలేషన్ షిప్, పెళ్లి వంటి అనేక వార్తలు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. తమకు బాగా ఇష్టమైన హీరో హీరోయిన్లు ఎక్కడికి వెళ్తారు అనే విషయాలను కూడా అభిమానులు తెలుసుకుంటూ ఉంటారు. తాజాగా ఒక స్టార్ హీరోయిన్ కి సంబంధించిన కెరియర్, సినిమా ప్రయాణం అలాగే వ్యక్తిగత జీవితం గురించి సామాజిక మాధ్యమాలలో బాగా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల గ్లామరస్ ప్రపంచానికి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన నటీనటులకు సంబంధించిన ప్రతి విషయం కూడా తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తారు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సినిమాల కంటే కూడా వ్యక్తిగత విషయాల తోనే ఎక్కువగా వార్తల్లో ఉంటారు. తమకు బాగా ఇష్టమైన హీరో హీరోయిన్లు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఇలా ప్రతి విషయంపై అభిమానులు ఫోకస్ చేస్తారు. తాజాగా ఒక సీనియర్ స్టార్ హీరోయిన్ గురించి సామాజిక మాధ్యమాలలో ట్రెండ్ అవుతుంది. ఈ స్టార్ హీరోయిన్ 49 ఏళ్ల వయసులో కూడా ఒంటరిగా జీవితం గడుపుతుంది. ఈ వయసులో కూడా ఆమె తన అందం, ఫిట్నెస్ కారణంగా ఇప్పటికీ కూడా లక్షలాది మంది అభిమానుల మనసులో స్థానం అందుకుంది.
Also Read: గంటకు 20 వేల టిక్కెట్లు..బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ‘హిట్ 3’
ఈ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ సుష్మిత సెన్. సుస్మితసేన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె 1975 నవంబర్ 19న హైదరాబాద్లో జన్మించింది. సుస్మితసేన్ 1994లో మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొని టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. 1996లో రిలీజ్ అయిన దస్తక్ సినిమాతో సుస్మితసేన్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తన అందంతో, తన నటనతో నటిగా మంచి ప్రశంసలు అందుకుంది. నటన పరంగానే కాకుండా సుస్మితసేన్ వ్యక్తిగత విషయాలతో కూడా బాగా వార్తల్లో నిలిచింది.
ఈ నటి పేరు 12 మంది హీరోలతో ముడిపడి ఉంది అని వార్తలు వినిపించాయి. వీళ్లలో రెహమాన్ శాల్, విక్రమ్ భట్టు, రణదీప్ హూడ, లలిత్ మోడీ, వసీం అక్కడ వంటి అనేక పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోలేదు. ఈమె తనకు నచ్చినట్టుగా తన జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంది. సుస్మితసేన్ రేనే, అలీసా అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం సుస్మితసేన్ బాగా యాక్టివ్గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి ఏకంగా 7.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
View this post on Instagram