Pawan Kalyan is serious: ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర పరిణామం ఒకటి జరిగింది. భీమవరం డిఎస్పి పై ఆకస్మిక బదిలీ వేటు పడింది. అయితే పోలీస్ శాఖలో బదిలీలు అనేవి సర్వసాధారణం. కానీ భీమవరం డీఎస్పీ జయసూర్య పై బదిలీ వేటు మాత్రం అనూహ్యం. గతంలో ఆయన పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు కూడా. అయితే ఇది జరిగి ఆరు నెలలు అవుతోంది. పవన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అదే డి.ఎస్.పి జయ సూర్య పై మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు భిన్నంగా స్పందించారు. ఇప్పుడు అదే డి.ఎస్.పి జయసూర్యను భీమవరం నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఆదేశాల వల్ల బదిలీ జరిగిందా? లేకుంటే ఇది సాధారణ బదిలియా? అన్నది తెలియాల్సి ఉంది.
అనేక ఫిర్యాదులు..
గతంలో భీమవరం( Bhimavaram) డిఎస్పి పై పవన్ కళ్యాణ్ కు చాలా రకాల ఫిర్యాదులు వెళ్లాయి. సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని.. సివిల్ వివాదాల్లో సైతం డీఎస్పీ ప్రమేయం పెరుగుతోందని.. కూటమి నేతల పేరును ఎక్కువగా వాడుతున్నట్లు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై వేగంగా స్పందించారు పవన్ కళ్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో నేరుగా టచ్ లోకి వెళ్లారు. చర్చలు కూడా జరిపారు. డీఎస్పీకి సంబంధించిన వ్యవహారంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అతని వ్యవహార శైలి పై నివేదిక పంపించాలని ఎస్పీని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
రఘురామకృష్ణంరాజు కామెంట్స్..
అయితే అప్పట్లో ఇదే అంశంపై మాట్లాడారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు( raghurama Krishnam Raju) . భీమవరం డిఎస్పి జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకొచ్చారు. సమర్థవంతమైన అధికారిగా ఆయనకు పేరు ఉందని అప్పట్లో కామెంట్స్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. అయితే గత ఆరు నెలలుగా ఈ వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు అదే డిఎస్పి జయ సూర్య పై బదిలీ వేటు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో రఘువీర్ విష్ణు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బదిలీ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. సాధారణ బదిలీల్లో భాగంగానే అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనేనని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.