https://oktelugu.com/

Pawan Kalyan: ఆ రెండు పదవులపై ఆశ పెట్టుకున్న పవన్

Pawan Kalyan: ఏపీలో టీడీపీ కూటమి విజయం వెనుక పవన్ కళ్యాణ్ కృషి ఉంది. మూడు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు.. ఇలా అన్ని అంశాలు సక్సెస్ కావడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 10, 2024 / 11:20 AM IST

    Pawan is hoping for those two positions

    Follow us on

    Andhra Pradesh: కేంద్ర ప్రభుత్వం కొలువుదీరింది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 70 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి మంత్రి పదవులు దక్కాయి. ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలకు మంత్రి పదవుల్లో ఛాన్స్ దక్కింది. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ కూర్పు జరగనుంది. ఆశావాహులు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ పదవి చేపడతారు? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 165 అసెంబ్లీ స్థానాలు సాధించడంతో వైసిపి కి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది.

    Also Read: Amaravati Capital : అమరావతికి సరికొత్త కళ!

    ఏపీలో టీడీపీ కూటమి విజయం వెనుక పవన్ కళ్యాణ్ కృషి ఉంది. మూడు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు.. ఇలా అన్ని అంశాలు సక్సెస్ కావడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చంద్రబాబు సైతం చెప్పుకొచ్చారు. అటు 21 స్థానాల్లో జనసేన సంపూర్ణ విజయం సాధించింది. అందుకే ఆ పార్టీకి క్యాబినెట్లో కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో సముచిత స్థానం కల్పిస్తారని.. చంద్రబాబు తర్వాత గౌరవం దక్కేలా పదవి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం తో పాటు కీలక మంత్రిత్వ శాఖ ఇస్తారని సమాచారం.

    Also Read: Uttarandhra: ఉత్తరాంధ్ర – తెలుగు దేశం – కేంద్రమంత్రులు

    ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఏపీ మంత్రివర్గంలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. డిప్యూటీ సీఎం తో పాటు కీలక మంత్రిత్వ శాఖను ఆశిస్తున్నట్లు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు హోం శాఖను అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అప్పుడే పవన్ కు సముచిత స్థానం కల్పించినట్టు అవుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి పవన్ మంత్రివర్గంలో చేరారని అందరూ అభిప్రాయపడ్డారు. సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల మంత్రి పదవి తీసుకోరని భావించారు. కానీ పవన్ మాత్రం ప్రభుత్వంలో సముచిత స్థానం ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే పవన్ హోంమంత్రి తో పాటు డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటే బాగుంటుందని జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే క్లారిటీ రావాల్సి ఉంది. కానీ కేంద్ర మంత్రివర్గ కూర్పు, రామోజీరావు అకాల మరణంతో వాయిదా పడింది. ప్రస్తుతం ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఒక వైపు జరుగుతుండగా.. రాష్ట్ర మంత్రివర్గ కూర్పు కూడా సమాంతరంగా జరుగుతోంది. పవన్ చివరిలో తీసుకునే నిర్ణయం బట్టి పరిస్థితి ఉంటుంది. లేకుంటే మాత్రం పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తేలుతోంది.