Pawan Kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ డోసు పెంచారు. వైసీపీ సర్కార్ పై జెట్ స్పీడులో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయనంటూ ప్రకటించిన పవన్.. జగన్ సర్కార్ వైఫల్యాలపై ఫోకస్ పెంచారు. గత నాలుగున్నర ఏళ్లుగా ప్రభుత్వం చేపట్టిన విధ్వంసాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు. ఈ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. సునిశిత విమర్శలతో పాటు తెర వెనుక జగన్ సర్కార్ చేస్తున్న అరాచక పాలనను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 38 కేసులు ఉన్న వ్యక్తి సీఎం జగన్ అని.. ఆయన నీతులు చెప్పడం ఏమిటని పవన్ ఎద్దేవా చేస్తున్నారు. వైద్య కళాశాలలను వ్యాపార సంస్థలు గా మార్చేసారు అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఇంతకంటే చీకటి రోజులు ప్రజలకు వద్దని.. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కూటమి విజయం తధ్యమని తేల్చి చెబుతున్నారు.
వారాహి మూడో విడత యాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. పవన్ సరికొత్త విమర్శనాస్త్రాలకు వైసీపీ సర్కార్ తీరుపై విరుచుకుపడుతున్నారు. జగన్ గద్దె దించడానికి, జనసేన- టిడిపి కూటమి అధికారంలోకి రావడాన్ని తాను ఎందుకు కోరుకుంటున్నానో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష కోట్లు తినేశాడని తెలిసి కూడా జగన్ కు ఓటు వేసి గెలిపించడమే ఈ రాష్ట్రానికి శాపంగా మారిందన్న పవన్ ప్రకటన ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. వారిలో ఆలోచన తెచ్చిపెడుతోంది. 38 కేసులున్న జగన్ రాజకీయాలకు అనర్హుడాన్ని పవన్ తేల్చి చెప్తున్నారు. మళ్లీ ఈ రాష్ట్రానికి చీకటి రోజులు రాకూడదంటే జనసేన,తెలుగుదేశం కూటమి అధికారంలోకి తీసుకురావడమే ప్రజల ముందున్న కర్తవ్యం అని పవన్ చెబుతున్నారు. నాలుగు దశాబ్దాల టిడిపి అనుభవం, జనసేన పోరాట పటిమతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. 26 లక్షల దొంగ ఓట్లు సృష్టించినా కూటమి విజయాన్ని ఆపలేరని పవన్ తేల్చి చెబుతున్నారు.
జగన్ సర్కార్ను రూపాయి పావలా ప్రభుత్వంతో పవన్ పోల్చారు. చిన్నప్పుడు వీధుల్లో బొమ్మలమ్మేవాళ్లు రూపాయి పావలాకు బొమ్మ ఇస్తామని ఆకర్షించి.. దగ్గరకు వెళ్తే రేటు పెంచిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. జగన్ సైతం నవరత్నాలు అంటూ ప్రజలను ఆకర్షించి నిలువునా మోసం చేశారని ఆరోపించారు. 28 లక్షల ఇల్లు కడతామని మూడు లక్షల ఇల్లు కట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు. తన ఐదేళ్ల పాలనలో ఇళ్ల నిర్మాణానికి 43 వేల కోట్ల రూపాయల కేటాయిస్తామని చెప్పి.. 8258 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది నిజం కాదా అని నిలదీశారు. ఇందులో కూడా నాలుగు వేల కోట్లకు పైగా దోచేశారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో అత్యంత ఎక్కువగా అవినీతి జరిగింది ఏపీలోనని.. ఈ విషయం కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజా సంఘాలను విడిచిపెట్టడం లేదు. రాజకీయ ప్రత్యర్థులను కేసులతో వేధిస్తున్నారు. నేరుగా ఎమ్మెల్యేల అవినీతి పైనే ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోని జగన్ తానేదో చేగవేరా, పుచ్చలపల్లి సుందరయ్యలా మాట్లాడుతున్నారంటూ పవన్ ఎద్దేవా చేశారు.
వారాహి మూడో విడత యాత్రలో పవన్ పంధా మార్చారు. సరిగ్గా ఉమ్మడి కృష్ణాజిల్లాలో పవన్ యాత్ర చేపడుతున్నారు. అక్కడ వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ లాంటి నాయకులు ఉన్నారు. వారిపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి తగ్గట్టు అన్ని రకాల వనరులు పవన్ దగ్గర ఉన్నాయి. కానీ వైసిపి నేతల వ్యవహార శైలిని చూసిన తర్వాత పవన్ వారిపై వ్యక్తిగత విమర్శలు చేయనని చెప్పుకున్నారు. అందుకు తగ్గట్టుగానే వైసీపీ సర్కార్ పై మాత్రమే విమర్శలు చేస్తున్నారు. విధానపరంగా మాట్లాడుతున్నారు. గణాంకాలతో సహా వెల్లడించి వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగానే ఇది వైసీపీ నేతలకు కలవరపాటుకి గురిచేస్తుంది. ప్రస్తుతం ఏపీలో పవన్ చేసే విమర్శలు ప్రజల్లోకి చాలా ఫాస్ట్ గా వెళుతున్నాయి. ఇప్పుడు పవన్ వైసీపీ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతో ముందుకు సాగుతుండడంతో తమకు నష్టం తప్పదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan is criticizing the ycp government at jet speed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com