Pawan Kalyan : నా సినిమాలను అందరూ చూస్తారు.. కానీ ఎన్నికల సమయానికి కులాలుగా విడిపోతారు : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఈ ప్రసంగం లో ఇచ్చిన కొన్ని హైలైట్స్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఆయన మాట్లాడుతూ 'నా సినిమాలను కులమతాలకు అతీతంగా అందరూ చూసి ఆదరిస్తారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కులాలుగా విడిపోయి వేరే పార్టీలకు ఓట్లు వేస్తారు ఇది మారాలి' అని చెప్పుకొచ్చాడు.

Written By: NARESH, Updated On : June 14, 2023 9:35 pm
Follow us on

Pawan Kalyan : ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేడు ఘనంగా ప్రారంభం అయ్యింది. తొలి విడతలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలలో ఆయన పర్యటన నేడు ఘనంగా మొదలైంది. పత్తిపాడు సభ లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం యువత ని ఆలోచింపచేసే విధంగా, అలాగే క్యాడర్ లో ఎంతో ఉత్సాహం ని నింపే విధంగా సాగింది.

ఆవేశం తో కాకుండా ఎంతో సమన్వయం తో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, మాట ఇచ్చి తప్పిన హామీలను వెలికి చూపుతూ అధికార పార్టీ కి ముచ్చమటలు పట్టించేలా చేసాడు పవన్ కళ్యాణ్. ఇదే విధంగా ప్రసంగిస్తూ ఈ వారాహి యాత్ర కొనసాగిస్తే, అసలు వేరే పార్టీ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, సొంతంగానే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్తాపించొచ్చు అని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ ప్రసంగం లో ఇచ్చిన కొన్ని హైలైట్స్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఆయన మాట్లాడుతూ ‘నా సినిమాలను కులమతాలకు అతీతంగా అందరూ చూసి ఆదరిస్తారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కులాలుగా విడిపోయి వేరే పార్టీలకు ఓట్లు వేస్తారు ఇది మారాలి’ అని చెప్పుకొచ్చాడు.

ముస్లిమ్స్ ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ ‘కొంతమంది ముస్లిం మేధావులు మేము బీజేపీ తో కలిసి ఉన్నాము, వచ్చే ఎన్నికలలో మీకు ఓట్లు వెయ్యము అంటున్నారు, కానీ బీజేపీ చేసే ప్రతీ కార్యక్రమానికి వైసీపీ పార్టీ మద్దత్తు పలుకుతూ వస్తుంది, అది మీకు పర్లేదా. మరెలా వారికి అండగా ఉంటారు? నేను ముస్లింలపై దాడి జరిగితే మీ తరపున నిలబడే వ్యక్తిని, కానీ వైసీపీ నాయకులు ఇదే తూర్పు గోదావరి జిల్లాలో ఒక డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వారికి ఎలా అండగా ఉంటారు’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం జనాలను ఆలోచింపచేసేలా చేసింది.