JanaSena Varahi Vijaya Yatra: కోట్లాది మంది అభిమానులు మరియు రాజకీయ నాయకులూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన జనసేన పార్టీ ‘ వారాహి యాత్ర’ ఎట్టకేలకు నేడు ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ యాత్ర ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.యాత్ర ప్రారంభం అయ్యే రెండు రోజుల ముందే ఆయన తన మంగళగిరి పార్టీ కార్యాలయం లో ప్రజల సంక్షేమం కొరకు రెండు రోజుల పాటు మహా యాగం జరిపించాడు.
ఇక నేడు అన్నవరం గుడిని సందర్శించుకొని, ‘వారాహి’ యాత్రని పత్తిపాడు సభలో ఘనంగా ప్రారంభించాడు. ఈ సభకి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం తో పోలీసులకు సైతం వాళ్ళని అదుపు చెయ్యడం చాలా కష్టం అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగం లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ , అలాగే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మహత్తర కార్యక్రమాలు చేపట్టబోతుందో ఈ ప్రసంగం లో చెప్పుకొచ్చాడు.
ముఖ్యంగా యువత కోసం ఆయన ప్రవేశ పెట్టిన పథకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ జనసేన షణ్ముఖ వ్యూహం ద్వారా టాలెంట్ ఉండి, ఉపాధి కల్పించే ప్రణాళిక ఉండి, పెట్టుబడి లేక ఇబ్బందులు పడే యువతకు ప్రతీ నియోజకవర్గం నుండి 500 మంది యువతకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ క్రింద 10లక్షలు ఇస్తాము’ అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి రాగానే పెళ్ళైన నూతన వధూవరులకు లక్ష రూపాయిలు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు వాళ్లకు కనీసం రేషన్ కార్డులను కూడా కల్పించలేకపోయింది. జనసేన పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత నూతన వదూవరులకు ఉపాధి కల్పించడమే కాకుండా, వారి చేతిలో రేషన్ కార్డ్స్ కూడా పెడుతాం ‘ అని చెప్పుకొచ్చాడు. ఆయన ఇచ్చిన హామీలు, ప్రసంగం ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేసింది.
https://www.youtube.com/watch?v=e-LHFpIG0Hw
