Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. మంత్రిగా వచ్చే తన జీతభత్యాలను అనాధ పిల్లలకు అందించి మంచి వాతావరణాన్ని అలవరిచారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచారు పవన్ కళ్యాణ్. దాదాపు 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పిఠాపురం ప్రజల ఆశీస్సులతో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కీలక మంత్రిత్వ శాఖలతో పాటు డిప్యూటీ సీఎం హోదాను సాధించారు. రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇంతటి గుర్తింపు తెచ్చి పెట్టిన పిఠాపురం ప్రజల కోసం చాలా రకాలుగా కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మంత్రిగా తన జీతభత్యాలను సైతం పిఠాపురం వాసులకే కేటాయించారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్.. దేశం దృష్టిని ఆకర్షించిన మహిళా ఆధికారులు
* నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న వైనం..
ఆది నుంచి పిఠాపురం( Pithapuram ) విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు పవన్. తనను నమ్మి ఓటేసిన ప్రజలకు పవన్ కళ్యాణ్ అభివృద్ధి ఫలాలను అందిస్తున్నారు. అందులో భాగంగా పిట్టాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. దాదాపు 34 కోట్ల రూపాయలతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. ఇంకోవైపు పిఠాపురం ప్రజల కోసం అనేక రకాల అభివృద్ధి పనులు చేపడుతూ వచ్చారు. వచ్చే ఐదేళ్లలో పిఠాపురం సమగ్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
* అనాధ పిల్లలకు సాయం..
తాజాగా మరో సంచలన పథకాన్ని అమలు చేయనున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలోని అనాధ పిల్లలకు నేనున్నాను అంటూ ఆదుకున్నారు. అనాధ పిల్లల కోసం తన జీతం నుంచి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రతి నెల వారి ఇంటి వద్దనే పంపిణీ చేస్తామని ప్రకటించారు. శుక్రవారం 32 మంది అనాధ పిల్లలకు పవన్ కళ్యాణ్ స్వయంగా సాయం అందించారు. ఆమెకు ప్రకటన కూడా చేశారు. తాను పదవిలో ఉన్నంతకాలం ఈ సాయం అందిస్తానని ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాధ పిల్లలకు ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున అందించారు. శుక్రవారం అందుబాటులో ఉన్న 32 మందికి స్వయంగా అందించారు. మిగిలిన పదిమందికి జిల్లా అధికారుల ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని చెప్పారు. జీవితంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులకే ఖర్చు చేయనున్నట్లు ఈ మేరకు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Also Read : యుద్ధ భయంలో పాకిస్తాన్..ఏటీఎంలు ఖాళీ.. స్టాక్ మార్కెట్ పతనం
* ప్రత్యేక శ్రద్ధతో పవన్..
అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏ విషయంలో సైతం వెనక్కి తగ్గడం లేదు. వారి అభివృద్ధి తో పాటు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వచ్చారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జీతభత్యాలు తీసుకోకూడదని భావించారు. కానీ అనాధ పిల్లలకు సాయం చేయాలన్న ఆలోచనలో ఆ జీతభత్యాలను తీసుకున్నారు. తన కష్టాన్ని సైతం వారికే కేటాయిస్తున్నారు. నా జీతంతో పాటు జీవితం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే అన్నట్టు పవన్ కళ్యాణ్ తీరు ఉంది. దీనిపై పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.