Pawan Kalyan: కూటమి ప్రభుత్వంలో తనకు ఇష్టమైన శాఖలను తీసుకున్నారు పవన్ కళ్యాణ్. దాదాపు పల్లెపాలనకు సంబంధించిన శాఖలు పవన్ వద్ద ఉన్నాయి. ఆపై డిప్యూటీ సీఎం హోదా ఉంది. అందుకే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్వతంత్రంగా రివ్యూలు జరుపుతూ.. అధికారులకు కీలక ఆదేశాలు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజా సమస్యలపై నేరుగా స్పందించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం సాహసించని విధంగా.. గొప్ప నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు భారీగా నిధులు విడుదల చేశారు. పంచాయితీలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు గాను నామమాత్రంగా నిధులు ఇచ్చేవారు. చిన్న పంచాయతీకి వంద రూపాయలు, మేజర్ పంచాయితీకి 250 రూపాయలు మాత్రమే అందించేవారు. కానీ ఈ మొత్తాన్ని 100% పెంచుతూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. సామాన్య పంచాయితీకి పదివేల రూపాయలు, మేజర్ పంచాయితీకి పాతికవేల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాహసోపేత నిర్ణయం గా అభివృద్ధి చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా నిధులు పెంచలేదని.. అందుకు ముందుకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
*:వైసీపీ సర్పంచులే అధికం
ప్రస్తుతం సర్పంచులలో 70 శాతం వైసీపీకి చెందిన వారే. 2021 లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. మెజారిటీ పంచాయతీలను వైసిపి కైవసం చేసుకుంది. చాలామంది ఔత్సాహికులు గ్రామాభివృద్ధికి ముందుకు వచ్చారు. సర్పంచులు గా పోటీ చేశారు. కానీ వారి వీధుల్లో కోత విధించింది ప్రభుత్వం. నిధులు కూడా కేటాయించలేదు. రాజ్యాంగబద్ధంగా ఇచ్చే ఆర్థిక సంఘం నిధులకు సైతం కోత విధించింది. రకరకాల సర్దుబాట్ల పేరిట పక్కదారి పట్టించింది. దీంతో పంచాయితీ ఖాతాల్లో కనీస స్థాయిలో కూడా నగదు నిల్వలు లేవు. చిన్నపాటి పనులు కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో పంచాయతీలు ఉండేవి.
* ఉత్సవ విగ్రహాలుగా మార్చి
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులను కూడా ఉత్సవ విగ్రహాలు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. వారి అధికారాలకు చాలావరకు కత్తెర వేసింది. గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాఠశాలలు వద్ద సర్పంచులు జెండా ఎగురవేసేవారు. కానీ ఆ అధికారాన్ని కూడా కాల రాసింది. విద్య కమిటీ చైర్మన్ లతో జండా ఎగురువేసింది. పాఠశాలలపై సర్పంచుల పెత్తనాన్ని పక్కన పడేసింది. గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గాను పంచాయితీ సర్పంచులు తమ సొంత నిధులు పెట్టేవారు. గత ఐదేళ్లుగా కనీస స్థాయిలో కూడా నిర్వహణకు నిధులు కేటాయించలేదు. దీంతో సర్పంచులు పడిన బాధలు వర్ణనాతీతం.
* వినూత్న నిర్ణయాలు
పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో మాత్రం వెనక్కి తగ్గవద్దని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా పోటీలు, నైపుణ్య, సామర్ధ్య పోటీలు నిర్వహించాలని సూచించారు. అదే సమయంలో పంచాయితీలకు 100% నిధులు పెంచుతూ.. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సూచించారు. తనలో ఉన్న సమైక్యతా భావాన్ని, గ్రామాలపై మక్కువను ఇలా వ్యక్తపరిచారు పవన్. దీంతో డిప్యూటీ సీఎం తీరుపై వైసీపీ సర్పంచుల సైతం అభినందిస్తున్నారు. పవన్ చర్యలను ఆహ్వానిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan gave a wonderful gift to the villages on august 15
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com