Sobhita Naga Chaitanya Engagement: నాగ చైతన్య జీవితంలో ముందడుగు వేశారు. తన గర్ల్ ఫ్రెండ్ శోభిత ధూళిపాళ్ళతో ఆగస్టు 8 గురువారం నాడు నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే ఆమెతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. గత రెండేళ్లుగా శోభిత – నాగ చైతన్య రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై నాగ చైతన్య ఎప్పుడూ స్పందించలేదు. దాంతో ఇవన్నీ రూమర్లు గానే అంతా భావించారు.అయితే ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు లీక్ అవ్వడంతో డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. వెకేషన్ లో నాగ చైతన్య – శోభిత కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడం. అలాగే ఫారెన్ లో ఓ వైన్ పార్టీలో వీరిద్దరూ కలిసి కనిపించడం అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.
శోభితతో సీక్రెట్ గా డేటింగ్ చేసిన నాగ చైతన్య తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చాడు. అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా శోభిత – నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేశారు. అక్కినేని కుటుంబంలోకి ఎంతో సంతోషంగా కొత్త కోడలికి స్వాగతం పలికారు నాగార్జున. తాజాగా కొత్త పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫ్యామిలీ తో కలిసి దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో అక్కినేని ఫ్యామిలీ, శోభిత ఫ్యామిలీ కలిసి ఫోటోలకు పోజిచ్చారు. నాగ చైతన్య అత్త మామలను మనం సదరు ఫొటోల్లో చూడొచ్చు.
శోభిత ధూళిపాళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అమ్మాయి. తల్లి పేరు శాంత, తండ్రి పేరు వేణుగోపాలరావు. శోభితకు ఓ చెల్లి కూడా ఉంది పేరు సమంత. శోభిత కుటుంబ సభ్యులందరూ నిశ్చితార్థం వేడుకకు హాజరయ్యారు. నాగ చైతన్య-శోభిత కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. నాగ చైతన్య తండ్రి నాగార్జున వివాహానికి కొంత సమయం ఉందన్నారు.
ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు చందూ మొండేటి ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. తండేల్ మూవీలో నాగ చైతన్య జాలరి రోల్ చేయడం విశేషం. నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ తండేల్ మూవీ తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 11న దసరా కానుకగా తండేల్ మూవీ విడుదల కానుంది. ఈ మూవీపై నాగ చైతన్య చాలా ఆశలే పెట్టుకున్నాడు.
ఇక శోభిత ధూళిపాళ్ల తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ ఇటీవల విడుదలైంది. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ దర్శకత్వం వహించి నటించాడు. మంకీ మ్యాన్ మూవీలో శోభిత వేశ్య పాత్ర చేయడం విశేషం. ప్రస్తుతం సితార టైటిల్ తో ఒక హిందీ చిత్రం చేస్తుంది. మరి పెళ్లయ్యాక శోభిత నటన కొనసాగిస్తుందో లేదో తెలియదు. నాగ చైతన్య మొదటి భార్య సమంత వివాహం అనంతరం కూడా బోల్డ్ రోల్స్ చేయడం విశేషం.
Web Title: Naga chaitanya and sobhita dhulipala engagement photos getting viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com