Prashna Ravan Arrest: నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందో గతంలో పోసాని కృష్ణ మురళి విషయం లో మనమంతా చూశాము , ఇప్పుడు ప్రశ్న రావణ్ విషయంలో మరోసారి చూస్తున్నాము. యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు అసభ్యకరమైన మాటలతో దూషించడం, పిఠాపురం లోకి వెళ్లి ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే దానికి కూడా కులాల రంగు పులిమి గొడవలు పెట్టడాలు వంటివి చేయడం, టెర్రరిస్టులకు సపోర్టు చేస్తూ స్పెషల్ వీడియోలు చేయడం, ఇలా ఒక్కటా రెండా , ఇతని ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఇతను ఈ స్థాయిలో రెచ్చిపోతున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వాలు ఇతనిపై చర్యలు తీసుకోవడం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో తమ అసహనాన్ని వ్యక్తం చేసేవారు.
ఇక రీసెంట్ గా దళిత క్రైస్తవులు సభలో ఇతను చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో అర్థరాత్రి ఇతన్ని అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ జడ శ్రవణ్ కుమార్ వాదనలతో బెయిల్ వచ్చినప్పటికీ , సర్పవరం లో కొత్త కేసు నమోదు అవ్వడంతో అక్కడికి తరలించారు. అక్కడ కూడా ఇతనికి రిమాండ్ విధించకుండా బెయిల్ ఇవ్వడం తో , టెర్రరిస్టులకు సపోర్టుగా వీడియోలు చేసినందుకు మచిలీపట్టణం పోలీస్ స్టేషన్ లో ఇతని పై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఇప్పుడు ఇతను అక్కడే ఉన్నారు. అయితే ఇతన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతీ చోటా వెంబడిస్తున్నారు. అతనికి కఠినంగా శిక్షలు పడాలి , లేదంటే మాకు అప్పగించండి మేము చూసుకుంటాం అంటూ మండిపడుతున్నారు. పిఠాపురం , సర్పవరం పోలీస్ స్టేషన్స్ వద్దకు తీసుకెళ్లినప్పుడు రావణ్ పై గుడ్లతో దాడి చేశారు పవన్ ఫ్యాన్స్.
అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక నేడు మచిలీపట్టణం పోలీస్ స్టేషన్ లో పవన్ ఫ్యాన్స్ తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పారు. రావణ్ ని చితకబాదేందుకు పోలీస్ స్టేషన్ లోకి దూసుకొచ్చారు. వాళ్ళని అడ్డుకునేందుకు బారికేడ్లను పెట్టగా , వాటిని కూడా బద్దలు కొట్టుకొని ముందుకెళ్లారు. చివరికి పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అయ్యి, అక్కడి పరిస్థితులను చక్కబెట్టడం తో వాతావరణం చల్లపడింది. పవన్ ఫ్యాన్స్ ఆవేశం చూస్తుంటే , ప్రశ్న రావణ్ జైలు లో ఉండడమే మంచిది అనిపిస్తోంది. ఒకవేళ అతను బయటకు వస్తే పటిష్టమైన సెక్యూరిటీ ని ఏర్పాటు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉన్నది. కేవలం పవన్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా, హిందూ దేవుళ్లపై ఇతగాడు చేసిన వ్యాఖ్యలను ఎవ్వరూ క్షమించే పరిస్థితి లో ఇక లేరు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబొట్టునుండి అనేది.
కృష్ణాజిల్లా
ఇనగుదురు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉధ్రిక్తత
భారీగా ఇనగుదురు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టిన జనసేన కార్యకర్తలు
జనసేన కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
పోలీసులకు, జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట
బారికేడ్లను తోసుకుంటూ పోలీస్ స్టేషన్ వైపుకు దూసుకొచ్చిన జనసేన… pic.twitter.com/a06Mr43DyZ
— RTV (@RTVnewsnetwork) July 3, 2026

