Homeఆంధ్రప్రదేశ్‌Deputy CM Pawan Kalyan : ఇండస్ట్రీ పెద్దవు.. పైగా డిప్యూటీ సీఎం.. సమంతపై ఇంత...

Deputy CM Pawan Kalyan : ఇండస్ట్రీ పెద్దవు.. పైగా డిప్యూటీ సీఎం.. సమంతపై ఇంత దారుణం జరుగుతుంటే స్పందించవేంటయ్యా పవన్?

Deputy CM Pawan Kalyan :  తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి తర్వాత పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయారు. దీంతో ఆ బాధ్యతలను భుజస్కందాలపై వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మొన్నటికి మొన్న వైసీపీ హయాంలో టికెట్ల వివాదం పై లీడ్ రోల్ తీసుకొని మరి అప్పటి సీఎం జగన్ ను కలిశారు మెగాస్టార్.చిత్ర పరిశ్రమ కోసం చేతులు జోడించి జగన్ ను అడగడం అప్పట్లో వివాదాస్పదం అయింది. చిరంజీవికి ఘోర అవమానం జరిగిందని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది.సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని చెబుతూ.. కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ.ఎన్.కన్వెన్షన్ కూల్చివేయకుండా ఆపాలంటే సమంతాను తన దగ్గరకు పంపించాలని కేటీఆర్ అడిగారని బాంబు పేల్చారు. సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని నాగార్జున, నాగచైతన్య ఒత్తిడి తెచ్చారని.. అందుకుసమంత ఒప్పుకోకపోవడంతోనే ఆమెకు విడాకులు ఇచ్చారని సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితేఈ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబంతోపాటు సినీ పరిశ్రమ అంతా స్పందించింది.చివరకు మెగాస్టార్ సైతంస్పందించి ఖండించారు. ఇంత జరుగుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

* సినీ ప్రముఖుల స్పందన
తాజాగా మంత్రి సురేఖ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, ఆర్కే రోజా తదితరులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన చిరంజీవి ‘ గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డాను అని.. వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటు అని.. సినీ పరిశ్రమ సభ్యులపై ఇటువంటి దుర్మార్గపు మాటలను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తాం’ అంటూ పోస్ట్ చేశారు చిరంజీవి. రాజకీయాలకు సంబంధం లేని మహిళలను రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటు అని.. ఇది తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేశారు చిరంజీవి.

* సినీ పరిశ్రమకు పెద్దగా ఉంటూ
అయితే చిత్ర పరిశ్రమకు చెందిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సినీ పరిశ్రమ తరఫున పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వైసిపి హయాంలో తనను ఉద్దేశించి సినీ పరిశ్రమను ఇబ్బంది పెడితే తాను కచ్చితంగా స్పందిస్తానని చెప్పుకొచ్చారు. కానీఓ కుటుంబాన్ని,ఓ మహిళగా ఓ హీరోయిన్ ను ఇలా బయటకు లాగడంపై ఇంతవరకు స్పందించలేదు. సినీ పరిశ్రమలో చాలామంది ఈ ఘటనపై స్పందించారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని… అదే సినీ పరిశ్రమ అండదండలతో రాజకీయాల్లో రాణించిన పవన్ స్పందించకపోవడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.

&

;

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular