Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం (Pawan Kalyan) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైందవ ధర్మ పరిరక్షణకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన అప్పట్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ కావాలని డిమాండ్ చేశారు. అందుకు అందరూ సహకరించాలని కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పవన్ పిలుపును హిందూ ప్రముఖులు మద్దతు తెలిపారు. ప్రత్యేక ఆహ్వానం పలికారు. అటు తర్వాత ఏపీ కేంద్రంగా అనేక పరిణామాలు కూడా జరిగాయి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. దేశవ్యాప్తంగా మఠాధిపతులు, స్వామీజీలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని కూడా డిమాండ్ చేశారు. ప్రముఖ దేవాలయాలన్నీ ట్రస్ట్ బోర్డులోకి తేవాలని కోరారు కూడా. అప్పట్లో పవన్ డిమాండ్లు ఈ సభలో వినిపించాయి. తద్వారా పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని అందరూ గౌరవించినట్లు అయింది.
* ప్రముఖ ఆలయాల సందర్శన
అయితే మరోసారి సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కొత్త ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయించారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకొనున్నారు. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు. ఆయన సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. తిరిగి హైదరాబాద్ చేరుకున్న ఆయన.. నేరుగా కేరళ బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది. త్రివేండ్రంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. అనంతరం కొచ్చికి వచ్చి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తారు. గురువాయూర్, త్రిశూర్ లో పవన్ పర్యటన సాగనుంది.
* తమిళనాడులో మూడు రోజుల పర్యటన
అటు తరువాత పవన్ మూడు రోజులపాటు తమిళనాడులో( Tamil Nadu ) పర్యటించనున్నారు. అరక్కోణం, మధురై ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగనుంది. పవన్ కళ్యాణ్ తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ ఉండనున్నారు. గతంలో కేరళ టూరిజం డైరెక్టర్ గా చేసిన అనుభవం ఉండడంతో తన ఆలయాల సందర్శనకు పవన్ తనతో పాటు కృష్ణ తేజను తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆలయాల సందర్శనకు సంబంధించి బయటకు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. కనీసం షెడ్యూల్ ప్రకటన కూడా రాలేదు.
* పవన్ వెనుక బిజెపి
పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వెనుక బిజెపి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని ఎప్పటినుంచో బీజేపీ భావిస్తోంది. అందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ సాధ్యపడడం లేదు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ద్వారా దానిని సాకారం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు చరిష్మ ఉంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో సైతం హిందుత్వ వాదాన్ని బిజెపి బలంగా వినిపిస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి బిజెపి ప్రయత్నాలు ఫలించడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో హిందుత్వ వాదాన్ని తీసుకెళ్లాలన్నది బిజెపి ప్లాన్ గా తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan decides to visit famous temples demanding formation of a board for the protection of sanatana dharma
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com