Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan behind BJP Chief Appointment: ఏపీ బీజేపీ చీఫ్ నియామకం వెనుక పవన్?...

Pawan Kalyan behind BJP Chief Appointment: ఏపీ బీజేపీ చీఫ్ నియామకం వెనుక పవన్? కొత్త సమీకరణాలు

Pawan Kalyan behind BJP Chief Appointment: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా( AP BJP Chief ) యువనేత మాధవ్ ఎంపికయ్యారు. అధ్యక్ష పదవి కోసం చాలామంది ఆశావహులు పోటీపడ్డారు. చివరకు యువనేతగా ఉన్న మాధవ్ కు పదవి వరించింది. ఆది నుంచి మాధవ్ కుటుంబమంతా బిజెపిలోనే కొనసాగుతూ వచ్చింది. ఆయన తండ్రి చలపతిరావు ఉమ్మడి రాష్ట్రానికి బిజెపి అధ్యక్షుడిగా పని చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీలకు సమకాలీకుడు కూడా. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించడం వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది. అందుకే మాధవ్ ద్వారా ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావంతో ఉంది భారతీయ జనతా పార్టీ. ఏపీలో టిడిపి కూటమిలో బిజెపి కూడా యాక్టివ్ రోల్ మాధవ్ ద్వారా ప్లే చేసే అవకాశం ఉంది.

Also Read: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేసింది..ఊహకందని విజువల్స్..ఇంత భారీగా ఉంటుందని ఊహించలేదుగా!

* పెరిగిన పవన్ గ్రాఫ్..
Pawan Kalyan behind BJP Chief Appointment ఎన్డీఏలో( National democratic alliance) తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఎన్ డి ఏ కు అవసరమైన బలాన్ని ఏపీ నుంచి అందించింది కూడా ఆ పార్టీ. తద్వారా కేంద్రం నుంచి బిజెపి పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతోంది. అయితే టిడిపి, బిజెపిల మధ్య సయోధ్య కుదిర్చింది మాత్రం పవన్ కళ్యాణ్. ఆ రెండు పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కూటమి కట్టడంలో ఆయన పాత్ర కీలకం. ఒకవైపు ఏపీలో కూటమి సక్సెస్ కావడం.. మరోవైపు జాతీయ స్థాయిలో ఎన్డీఏ నిలబడడానికి ఏపీ కారణం.. ఇందుకు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడం వంటి కారణాలతో బిజెపి పెద్దలు.. పవన్ విషయంలో చాలా అభిమానంతో ఉంటారు. ఇప్పటివరకు మోడీ పవన్ పట్ల ఎంతో అభిమానం చూపేవారు. ఇది చాలా సందర్భాల్లో చూసాం కూడా. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ను అనుసరించి వెళ్లాలని బిజెపి అగ్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే బిజెపి నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు దిశ నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

* పవన్ అభినందన..
పివిఎన్ మాధవ్( pvn Madhav ) యువకుడు. పైగా బిజెపి భావజాలం ఉన్న నేత. ఏపీలో పార్టీని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. పివిఎన్ మాధవ్ నియామకంలో సైతం పవన్ అభిప్రాయాన్ని బిజెపి పెద్దలు తీసుకుంటారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మాధవ్ నియామకం అయిన వెంటనే ఆయనను అభినందించారు పవన్ కళ్యాణ్. వెనువెంటనే మాధవి కూడా తన అభిమానాన్ని చాటుకున్నారు. తమిళనాడులో పవన్ కళ్యాణ్ పర్యటించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దానిని తప్పుపడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాధవ్. తద్వారా పవన్ విషయంలో తాము ముందు ఉంటామని హెచ్చరికలు జారీ చేశారు.

* ఆ ఇద్దరు సరసన..
అయితే ఇప్పటివరకు ఏపీలో( Andhra Pradesh) మూడు పార్టీలు ఉమ్మడిగా వెళుతున్నాయి. కానీ చాలా వేదికలు వద్ద, కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో చంద్రబాబుతో పాటు పవన్ కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు పురందేశ్వరి కనిపించినా పెద్ద ప్రభావం చూపలేదు. అయితే మాధవ్ యువనేత కావడంతో.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో ఇట్టే జత కడతారని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. మాధవ్ నియామకం కూటమి ఐక్యతకు ఒక సంకేతమని.. తప్పకుండా ఈ త్రయం నాయకత్వం వర్కౌట్ అవుతుందని కూటమి వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version