Poonam targets star director again: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(TRIVIKRAM SRINIVAS) పై తరచుగా ఆరోపణలు చేస్తుంది పూనమ్ కౌర్(POONAM KAUR). నేరుగా ఆయన పేరు ప్రస్తావించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ వలన తనకు జరిగిన అన్యాయం పై గతంలో ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసినట్లు కూడా ఆమె చెప్పడం విశేషం. అయితే తన ఫిర్యాదుకు ఎవరూ స్పందించలేదు. త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోలేదని పూనమ్ అసహనం వ్యక్తం చేశారు. పూనమ్ ఆరోపణలపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆమె అప్పుడే ఎందుకు ఓపెన్ గా స్పందించలేదని ప్రశ్నించారు.
పలు సందర్భాల్లో త్రివిక్రమ్ టార్గెట్ గా పూనమ్ కౌర్ సోషల్ మీడియా కామెంట్స్ చేశారు. తాజాగా ఆమె మరోసారి పరోక్షంగా ఆరోపణలు చేసింది. ట్విట్టర్ ఎక్స్ వేదికగా… తనదైన ఒరిజినల్ స్క్రిప్ట్స్ తో సినిమాలు చేసే డైరెక్టర్ క్రిష్ కి రావాల్సినంత గుర్తింపు రాలేదు. పలుమార్లు కాపీ రైట్స్ వివాదాలు ఎదుర్కొని, పీఆర్ స్టంట్స్ తో నెట్టుకొస్తున్న ఆ డైరెక్టర్ మాత్రం గొప్ప పేరు తెచ్చుకున్నాడు… అని కామెంట్ చేశారు. ఎంతో టాలెంట్ ఉన్న క్రిష్ గుర్తింపుకు నోచుకోలేదు, కాపీ కథలతో సినిమాలు చేసే ఆ దర్శకుడు మాత్రం స్టార్ అయ్యాడనే అర్థంలో పూనమ్ ఆ ట్వీట్ చేసింది.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేసింది..ఊహకందని విజువల్స్..ఇంత భారీగా ఉంటుందని ఊహించలేదుగా!
ఇక పూనమ్ సదరు ట్వీట్ లో ప్రస్తావించిన కాపీ కథల దర్శకుడు త్రివిక్రమ్ అంటూ.. కామెంట్ సెక్షన్ లో నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన పలుమార్లు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి చిత్రం విషయంలో త్రివిక్రమ్ అడ్డంగా బుక్ అయ్యాడు. ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్ ని అజ్ఞాతవాసిగా తెరకెక్కించడం వివాదాస్పదం అయ్యింది. ఆ మూవీ దర్శకుడు చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో మేటర్ సెటిల్ చేశారు. నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సైతం కాపీ ఆరోపణలు ఎదుర్కొంది. అది ఓ ఫేమస్ రైటర్ నవల కథ అంటూ కథనాలు వెలువడ్డాయి.
Also Read: ఇక మీదట దిల్ రాజు కి మెగా హీరోల నుంచి అవకాశాలు రావా..?
ఇక త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురములో సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఇంటిగుట్టు చిత్రానికి లేటెస్ట్ వెర్షన్ అని విమర్శలు వినిపించాయి. మరోవైపు పూనమ్ కౌర్ ఆరోపణల మీద త్రివిక్రమ్ ఏనాడూ స్పందించింది లేదు. అల్లు అర్జున్ తో ఆయన చేయాల్సిన చిత్రం వాయిదా పడింది. నెక్స్ట్ హీరో వెంకటేష్ తో మూవీ చేస్తున్నాడని సమాచారం. అనంతరం అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్ తో త్రివిక్రమ్ మూవీ చేసే అవకాశం కలదు.
Krish a director with original content and authentic scripts doesn’t get as much recognition or success like that of a director with multiple copyright issues and pr stunts.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 2, 2025