Tirumala Tirupati Devasthanam
Tirupati : తిరుమల తిరుపతి దేవస్థానంలో( Tirumala Tirupati Devasthanam) మరో వివాదం. ముంతాజ్ హోటల్( Mumtaj hotel) నిర్మాణం పై వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముంతాజ్ హోటల్ కు స్థలం కేటాయింపు పై స్వామీజీలు, హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. తాజాగా నిరసన చేపట్టాయి. ఏడుకొండల పవిత్రత దెబ్బతింటుందని.. సనాతన ధర్మానికి ఇది ముప్పు అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే అంశంపై హైకోర్టులో పిల్ దాఖలయింది. దీనిపై టిటిడి తాజాగా అఫీడవిట్ దాఖలు చేసింది. హోటల్ విషయంలో టిటిడి నిర్ణయాన్ని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం కొత్త మలుపుకు దారి తీసినట్టు అయ్యింది.
Also Read : మారింది అధికారమే.. విధానాలు అలానే.. మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి విధ్వంసం!
* వేర్వేరుగా పిటిషన్లు తిరుపతిలో( Tirupati) ముంతాజ్ హోటళ్ల నిర్మాణ వివాదం కొద్ది రోజులుగా కొనసాగుతూ వస్తోంది. అయితే దీనిపై స్వామీజీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూములను వెనక్కి తీసుకోవాలని కోరారు. స్వామి శ్రీనివాసానంద ఆధ్వర్యంలో స్వామీజీలు దీక్షకు దిగారు. ఒబెరాయ్ గ్రూపునకు సంబంధించిన హోటళ్లకు కేటాయించిన స్థలాలను తక్షణం రద్దు చేయాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస స్వామీజీ హైకోర్టులో వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. వీటిపై గతంలోనే కోర్టు విచారణ చేపట్టింది. టీటీడీ ఈవో, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తుడా వైస్ చైర్మన్, ఒబేరాయ్ గ్రూప్ హోటల్ ఎండి, అదే గ్రూపునకు చెందిన ముంతాజ్ హోటల్స్, ట్రైటెంట్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఎం డి లకు నోటీసులు జారీ చేసింది కోర్టు. దీనిపై టీటీడీ అఫీడవిట్ దాఖలు చేసింది.
* టీటీడీ అభిప్రాయం స్పష్టం..
తిరుపతి గ్రామీణ మండలం పేరూరు( peruru) గ్రామం పరిధిలో ఒబేరాయ్ గ్రూప్ సంస్థ హోటళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం 20 ఎకరాలను కేటాయించింది. అయితే గత ఏడాది నవంబర్లో టీటీడీ ఈవో శ్యామలరావు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఆ భూముల కేటాయింపును రద్దు చేయాలని కోరారు. అదే విషయాన్ని తాజాగా అఫీడవిట్లో పేర్కొన్నారు. ఒబెరాయ్ సంస్థ నిర్మించే ముంతాజ్ హోటల్స్, ట్రైడెంట్ ఫైవ్ స్టార్ హోటల్లో విలాసవంతమైన విల్లాలతో పాటు బార్లు, లాంజ్, పార్టీ హాళ్లు, స్పార్ నిర్మించేందుకు అనుమతించడం తిరుమల కొండ పవిత్రత, ఆధ్యాత్మికత, హిందూ మత సాంప్రదాయాల విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో ఈ హోటల్లో నిర్మాణానికి టీటీడీతో పాటు ప్రభుత్వం కూడా వ్యతిరేకం అని తేలిపోయింది.
Also Read : తిరుపతి తొక్కిసలాట.. ఎస్పి పై బదిలీ వేటు.. మళ్లీ ఇప్పుడు తిరుపతిలోనే పోస్టింగ్