Pawan Kalyan: యూత్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square). 2023 వ సంవత్సరం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘మ్యాడ్’ చిత్రానికి ఇది సీక్వెల్. మొదటి భాగం లో హీరోలు గా చేసిన వాళ్ళే రెండవ భాగం లో కూడా చేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ అంటే సాధారణంగానే క్రేజ్ తారాస్థాయిలో ఉంటుంది. అలాంటిది ఆ సినిమాలోని ప్రీ రిలీజ్ కంటెంట్ మొత్తానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తే ఇక ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. స్టార్ హీరోలకు అక్కడ ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయో, ఈ సినిమాకు కూడా అలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రొమోషన్స్ పై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు మేకర్స్. అందులో భాగంగా రీసెంట్ గా చేసిన ఒక ఫన్ ఇంటర్వ్యూ లో నిర్మాత నాగవంశీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ఈ ఇంటర్వ్యూ ని ఈ చిత్రంలో ఒక హీరో గా చేసిన సంగీత్ శోభన్(Sangeeth Sobhan) చేశాడు. ఆయన నాగవంశీ(Naga Vamsi) ని ఒక ప్రశ్న అడుగుతూ ‘పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఎన్టీఆర్(Junior NTR) గార్ల 50 వ సినిమాని నిర్మించాలి. కేవలం ఒక్కరితోనే తీసే పరిస్థితి వస్తే, మీరు ఎవరితో చేయడానికి ఇష్టపడుతారు?’ అని అడగగా, దానికి నాగవంశీ సమాధానం చెప్తూ ‘పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఇంకా ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకోవాలి కానీ, ఆయనతో సినిమా చేయాలని అనుకోవడం తప్పు. కాబట్టి నేను ఎన్టీఆర్ అన్న తో సినిమా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంగీత్ శోభన్ చాలా తెలివిగా తప్పించుకున్నారు అన్నా అంటూ కౌంటర్లు వేస్తాడు.
‘మ్యాడ్ స్క్వేర్’ విషయంలో ఆడియన్స్ కి మీరు కావాల్సిన రేంజ్ హైప్ ఇవ్వలేదని ఒక టాక్ ఉంది,దీని పై మీ కామెంట్ ఏమిటి అని సంగీత్ శోభన్ అడగగా, దానికి నాగవంశీ సమాధానం చెప్తూ ‘కొంతమంది రివ్యూయర్స్ సినిమా అంటే ఇవన్నీ కచ్చితంగా ఉండాలి, స్టోరీ అద్భుతంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ నేను ముందే చెప్తున్నాను,. మా సినిమాలో స్టోరీ లైన్ చాలా సిల్లీ గా ఉంటుంది. ఈ సినిమాని మేము కేవలం నవ్వుకోవడానికి కోసం మాత్రమే చేసాము. థియేటర్స్ కి వచ్చే మిమ్మల్ని పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించే బాధ్యత మాది, లేకుంటే మీరు కొన్న టికెట్ డబ్బులను తిరిగి ఇచ్చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. మార్చి 28 న విడుదల అవుతున్న ఈ సినిమాకు పోటీగా నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండిట్లో ఏది సూపర్ హిట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారిన అంశం. రెండు చిత్రాలకు మంచి రిపోర్ట్స్ ఉన్నాయి.