Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan )తన తల్లి పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజున గొప్ప నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జూ పార్క్ లోని రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు వాటికి సంబంధించిన అన్ని ఖర్చులు తానే భరిస్తానని చెప్పి తన ఉదాహరణ చాటుకున్నారు. జంతు సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నా లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో పర్యటించిన ఆయన సీతాకోకచిలుకతో గడిపిన దృశ్యాలు, ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ప్రారంభోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిన్ననే ఆయన విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ ను సందర్శించారు. అక్కడే ఉన్న జిరాఫీలను చూసి ఎంతో ముచ్చట పడ్డారు. ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
* తల్లితో ప్రత్యేక అనుబంధం..
మెగా బ్రదర్స్ కు తల్లి అంజనాదేవితో( Anjana Devi) ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంతగానో ప్రేమ పంచుతారు. ఆమె పుట్టినరోజు జనవరి 29. అందుకే రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నట్లు పవన్ ప్రకటించారు. వాటి నిర్వహణకు అయ్యే పూర్తి ఖర్చును తాను స్వయంగా భరిస్తానని ఆయన ప్రకటించారు. జూ పార్కులోని బటర్ఫ్లై పార్కును పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆ సమయంలో ఆయన పై సీతాకోకచిలుకలు వాడడం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది. ఆ పార్కులో ఎన్నో రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. వాళ్లల మధ్య ఉన్న వాటికి ఆహారం ఎలా అందిస్తారు వంటి వివరాలను జూక్యురేటర్ను అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆది నుంచి పర్యావరణం అంటే పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టం. అందుకే గెలిచిన వెంటనే సంబంధిత శాఖలను మాత్రమే తీసుకున్నారు.
* ఎంతో ఉత్సాహంగా..
విశాఖపట్నం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్.. జూ పార్కును( Zoo Park) సందర్శించారు. అక్కడ నిబంధనలను పాటిస్తూనే ఏనుగులు, జిరాఫీలు, పులులు, సింహాల ఎంక్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి ఆహారం అందించారు.. సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో ఈ జూ పార్క్ ఉంది. కొత్తగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఎదురుగా ఉన్న కంబాలకొండలో.. ఎకో పార్కులో నగరవణాన్ని సైతం ప్రారంభించారు. అక్కడ చెక్క వంతెన పై కనోపి వాక్ చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూ పార్కులో ఉల్లాసంగా గడపడం విశేషం.
జంతు సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..
విశాఖ జూ పరిశీలన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి పిలుపు.
తల్లి శ్రీమతి అంజనాదేవి గారి జన్మదినం సందర్భంగా జిరాఫీల దత్తత, ఏడాది పాటు పోషణ ఖర్చులు భరిస్తానని తెలిపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. pic.twitter.com/Df8eBPEei9
— JanaSena Party (@JanaSenaParty) January 29, 2026