Homeఆంధ్రప్రదేశ్‌Pawankalyan : జనం కోసం మారిన పవన్

Pawankalyan : జనం కోసం మారిన పవన్

Pawankalyan : పవన్ వ్యూహంలో మార్పునకు కారణమేంటి? ఇన్నాళ్లూ పదవులతో పనిలేదన్న ఆయన స్ట్రాటజీ మార్చారెందుకు? సెడెన్ గా సీఎం పదవి ఎందుకు కోరుతున్నట్టు? పనితీరు మారకుంటే రెండేళ్లలో రాజీనామా చేస్తానని ఎందుకు చెబుతున్నారు? పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఇదంతా తనను అభిమానించే వారి కోసమేనంటూ పవన్ చెబుతున్నారు. కానీ కారణం వేరే ఉందన్న చర్చ నడుస్తోంది. ఏపీలో మెజార్టీ ప్రజలు చంద్రబాబు, జగన్ పాలనను చూశారు. ఎత్తూపల్లాలు, తప్పొప్పులు, ఇలా అన్నిరకాలుగా పరిణామాలను ప్రజలు చవిచూశారు. అయితే పవన్ లో నిజాయితీ కనిపిస్తోంది. పార్టీ స్థాపించి సుదీర్ఘ కాలమవుతున్నా, సరైన విజయం దక్కకున్నా ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా భావిస్తున్నారు. వాటి కోసం అలుపెరగని కృషిచేస్తున్నారు.
ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మెజార్టీ ప్రజలకు మింగుడుపడడం లేదు. అలాగని ప్రత్నామ్నాయం లేదు. పవన్ రూపంలో ఉన్నా ఆయన గెలుపోటములను నిర్దేశించగలరే కానీ.. గెలుపు అందుకునే స్థితిలో లేరు. పైగా ఏదో ఒక పార్టీ నీడకు చేరక తప్పని పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ అంటే గిట్టని వర్గాలు పవన్ గొడుగు కిందకు చేరుతున్నాయి. కానీ అదే పవన్ చంద్రబాబుతో వేదిక పంచుకోవడం వారికి ఇష్టం లేదు. ఇటీవల పవన్ చేసిన సర్వేలో అదే తెలింది. వైసీపీకి 18 శాతం గ్రాఫ్ తగ్గింది. ఇలా తగ్గిన వర్గాలు జనసేన వైపు చూస్తున్నారు. జనసేన మాత్రం టీడీపీ వైపు చూస్తోంది. అందుకే వారు పునరాలోచనలో పడినట్టు నేరుగా పవన్ కు నివేదికలందాయట.
పవన్ సెడన్ గా స్ట్రాటజీ మార్చడం వెనుక ఉన్నది ఏపీ జనమే. కానీ పవన్ మాత్రం తనను అభిమానించే వారి కోసమే సీఎం చాన్స్ అడిగినట్టు చెబుతున్నారు. అంటే వారు ఫ్యాన్స్ కాదు. ఒక సెక్షన్ ప్రజలనేని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అంటే ఇష్టం లేని చాలా వర్గాలు వైసీపీ వైపు టర్న్ అయ్యాయి. జగన్ అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేస్తారని భావించాయి. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అదే వర్గాలు వంచనకు గురయ్యాయి. అలాగని టీడీపీ వైపు అవి చూడడం లేదు. పవన్ వైపు చూస్తున్నా.. ఆయన టీడీపీ వైపు వెళ్లాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టే పవన్ యూటర్న్ తీసుకున్నారు. పైకి మాత్రం తనను అభిమానించే వారి కోసమే సీఎం స్లోగన్ ఇచ్చానని చెబుతున్నా.. తెర వెనుక మాత్రం వైసీపీ నుంచి టర్న్ అయిన వారికి నమ్మకం కలిగించేందుకేనని విశ్లేషణలు వెలువడుతున్నాయి. సో అందులో ఎంత వాస్తవముందో చూడాలి మరీ.
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version