Homeఆంధ్రప్రదేశ్‌Pakistan Colony In AP: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. తాజాగా పేరు మార్చేశారు తెలుసా?

Pakistan Colony In AP: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. తాజాగా పేరు మార్చేశారు తెలుసా?

Pakistan Colony In AP: ఏపీలో( Andhra Pradesh) పాకిస్తాన్ పేరుతో ఒక కాలనీ ఉంది. మీరు వింటున్నది నిజమే. విజయవాడలోని పాకిస్తాన్ కాలనీ( Pakistan Colony ) పేరుతో ఒక ప్రాంతం ఉంది. ఎప్పటినుంచో ఆ పేరు కొనసాగుతోంది. అయితే ఆ పేరు మార్చాలని స్థానికులు చాలా ఏళ్లుగా కోరుతూ వస్తున్నారు. కానీ ఎట్టకేలకు వారి విన్నపాన్ని మన్నించింది ఏపీ ప్రభుత్వం. ఆ కాలనీ పేరును మార్చింది. స్థానికులకు ఇష్టమైన మరో పేరును ప్రకటించింది. విజయవాడలోని 62వ డివిజన్ పరిధిలో ఈ పాకిస్తాన్ కాలనీ ఉంది. ఆ కాలనీ పేరును తాజాగా మార్చారు. భగీరథ కాలనీగా నామకరణం చేశారు. అదే సమయంలో స్థానికుల ఆధార్ చిరునామాను సైతం మార్చినట్లు జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రకటించారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

Also Read: కడపలో వైసీపీ నేతలతో అదృశ్య శక్తి.. బిజెపి ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు!

* గత కొద్ది రోజులుగా డిమాండ్..
పాకిస్తాన్ కాలనీగా ఉన్న ఈ కాలనీ పేరు మార్చాలని గత కొద్ది రోజులుగా స్థానికులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులకు విన్నపాలు చేసేవారు. ఎట్టకేలకు ఆ పేరు మార్పు సహకారం అయింది. పాకిస్తాన్ కాలనీ పేరు వెనక చాలా చరిత్ర ఉంది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. ఆ తరువాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. ఆ సమయంలో ఈరుద్దేశాల సరిహద్దుల్లో ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అప్పట్లో కొన్ని కుటుంబాలు ఇండియాకు వచ్చి తలదాచుకున్నాయి. అటువంటి సమయంలోనే 40 కుటుంబాలతో విజయవాడలోని పాయకాపురంలో ఈ కాలనీ ఏర్పాటు అయింది. 1984లో 40 గృహాలు, మూడు రోడ్లతో నిర్మించిన ఈ కాలనీకి పాకిస్తాన్ కాలనీగా పేరు పెట్టారనే ఒక వాదన ఉంది.

* శరణార్థులుగా వచ్చారట..
ఇక్కడ మరో రకమైన ప్రచారం కూడా జరుగుతోంది. దేశ విభజన సమయంలో కొన్ని కుటుంబాలు నిర్వాసితులుగా, శరణార్థులుగా.. పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్స్( Sindhu province ) నుంచి గుజరాత్ మీదుగా భారత్ లోకి వచ్చారని చెబుతున్నారు. వందలాది కుటుంబాలు వలస వచ్చాయని.. చెన్నై కోల్కత్తా రైలు మార్గంలో ఉన్న విజయవాడ ప్రధాన కూడలిగా ఉండడంతో.. ఈ కుటుంబాలన్నీ ఇక్కడకు వచ్చాయని ఒక ప్రచారం. అలా ఇక్కడ స్థిరపడడంతో పాకిస్తాన్ కాలనీ పేరిట గృహ సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారనేది ఒక కథనం. అయితే దశాబ్దాల కిందట వచ్చిన వీరు స్థానికులతో కలిసి పోయారు. ఎక్కడి వారు గా మారిపోయారు.

* ఆధార్ లో అడ్రస్ మార్పు..
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పాకిస్తాన్ కాలనీ కాస్త భగీరథ కాలనీగా( Sindhu province ) మారింది. కొత్త పేరుతో ఈ ప్రాంతంలో నివాసం ఉండే దాదాపు 60 మందికి ఆధార్లో అడ్రస్ మార్చినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ కాలనీ పేరు మార్చాలని కోరుతూ స్థానికులతో పాటు రాష్ట్ర సగర్ రాజపూత్ సేవా సమితి సభ్యులు పోరాడుతూ వచ్చారు. దానికి స్పందిస్తూ ప్రభుత్వం కాలనీ పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అయితే దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పేరు మార్పుతో.. స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

 

Also Read: అండమాన్ లో టిడిపి జెండా!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular