Virupaksha 2: బైక్ ప్రమాదానికి గురై, చాలా కాలం తర్వాత కోలుకొని, సాయి ధరమ్ తేజ్(Sai Tej) ‘విరూపాక్ష’ చిత్రం ద్వారా మన ముందుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. 2023 వ సంవత్సరం లో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అంతకు ముందు సాయి ధరమ్ తేజ్ కి ఫ్లాపులు ఉండేవి. కానీ ఈ చిత్రం మాత్రం ఆయన్ని ఫ్లాప్స్ నుండి బయటకి తీసుకొచ్చింది. అప్పటి వరకు కేవలం 30 కోట్ల షేర్ మార్కెట్ కి మాత్రమే పరిమితమైన సాయి ధరమ్ తేజ్, ఈ చిత్రం తో ఏకంగా 50 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టాడు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకొని పీక్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఎన్నో హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి కానీ, ఈ రేంజ్ హారర్ థ్రిల్లర్ మాత్రం రాలేదని అప్పట్లో ఈ సినిమాని చూసిన వాళ్ళు చెప్పుకొచ్చారు.
Also Read: సీరియల్ లో తల్లి పాత్రలో పద్ధతిగా.. నెట్టింట్లొ మాత్రం అందాలతో సెగలు…
ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. హీరోయినే విలన్ అని ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారిగా ట్విస్ట్ రెవీల్ అయ్యేలోపు థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ నోరెళ్లబెట్టారు. సినిమాలో ఎన్నో భయానక సన్నివేశాలు ఉన్నాయి. సుకుమార్ దగ్గర ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కార్తీక్ దందు ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. తొలిసినిమాతోనే అంత పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్న కార్తీక్ ప్రస్తుతం నాగ చైతన్య తో ఒక మిస్టిక్ థ్రిల్లర్ ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా సాగుతుంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే ‘విరూపాక్ష’ సీక్వెల్ ని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారట.
నాగ చైతన్య తో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే, విరూపాక్ష సీక్వెల్ మొదలు అవుతుందని అంటున్నారు. ఈ సీక్వెల్ లో హీరోయినే గా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ భోర్సే నటిస్తుందట. ఈమధ్య కాలంలో వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్న భాగ్యశ్రీ, ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసింది. విరూపాక్ష క్లైమాక్స్ లో హీరోయిన్ చనిపోయిన తర్వాత హీరోలోకి దూరినట్టు చూపిస్తాడు డైరెక్టర్. అక్కడి నుండే సీక్వెల్ మొదలు అవుతుందని తెలుస్తుంది. అయితే ఇందులో హీరోయిన్ క్యారక్టర్ కూడా నెగటివ్ షేడ్ లోనే ఉంటుందా? , లేకపోతే మామూలుగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల యేటి గట్టు’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా వెంటనే ఆయన విరూపాక్ష సీక్వెల్ సెట్స్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ‘ఫౌజీ’ లో హీరోయిన్ మార్పు..రీ షూట్ తప్పేలా లేదు..కోట్ల రూపాయిల నష్టం!