MLC Duvvada Viral Video : ఆయనది ఆరుపదుల వయసు.. ఆమె వయసు ఐదు పదులకు దగ్గరగా ఉంది. అయితేనేం.. సినీ సెలబ్రిటీలకు తోసి రాజని రీల్స్ తో కేక పుట్టించారు. అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.. ఇంతకీ వారు ఎవరో తెలుసా? ఏపీలో ఎవర్ గ్రీన్ స్నేహితులు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. సోషల్ మీడియాలోనూ వారే, డిజిటల్ మీడియాలోనూ వారే, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వారే హాట్ టాపిక్. వారిద్దరి రీల్స్, వీడియోలు చూస్తుంటే నిజంగా సినిమా వారే అన్నభావన ఉంటుంది.ఆరుపదుల వయసులో దువ్వాడ శ్రీనివాస్ మెరిసిపోయారు. మంచి కాస్ట్యూమ్స్ తో బాలీవుడ్ హీరో తరహా లో ఉన్నారు. ఇక మాధురి గురించి చెప్పనవసరం లేదు. ఆమె ప్రత్యేక కాస్ట్యూమ్స్ తో అభినయం, అందచందాలతో అభిమానులకు ఫిదా కలిగేలా చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యవహారం నడుస్తుండగా.. తాజాగాదువ్వాడ శ్రీనివాస్, మాధురి లా వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
* అవుట్ డోర్ షూటింగ్లో..
సాధారణంగా రీల్స్ ఇంట్లో చేస్తారు. కానీ ఈ స్నేహితుల ద్వయం మాత్రం అవుట్డోర్ ను ఎంచుకుంది. అరకు, కులుమనాలి, గోవాలా అక్కడ సీన్లు కనిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా తాము అన్నిచోట్ల తిరుగుతున్నామని.. కలిసే ఉంటున్నామని ఇద్దరూ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి వీడియోలు బయటపడుతుండడం విశేషం.
* అప్పట్లో దేవాలయాల సందర్శన
టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. పోలింగ్ అనంతరం ఆయన దేవాలయాలు,పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. అప్పట్లోనే వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. కానీ లైట్ తీసుకున్నారు. ఇప్పుడు అవే దృశ్యాలు హైలెట్ అవుతున్నాయి. కుటుంబ వివాదం నేపథ్యంలో తెగ ట్రోల్ అవుతున్నాయి.
* సోషల్ మీడియాలో హల్చల్
తమను వీధిన పడేసారని మాధురి బాధపడుతోంది. తన భార్య పిల్లలను తప్పుదోవ పట్టించిందని.. తనను పట్టించుకోలేదని.. అందుకే మాధురితో తో స్నేహం చేసినట్లు దువ్వాడ చెబుతున్నారు. తాము చేసింది తప్పు అని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే చాలా రకాల సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.