Venkatesh: డాక్టర్ డి రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ కెరియర్ మొదట్లో సింపుల్ గా ఉండే క్లాస్ క్యారెక్టర్లలో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సినిమాలో నటిస్తూ యూనివర్సల్ యాక్టర్ గా కూడా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఆ క్రమంలోనే చంటి, బొబ్బిలి రాజా, గణేష్ ప్రేమించుకుందాం రా, రాజా లాంటి వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే వెంకటేష్ తో సినిమా అని చెప్పగానే ఒక స్టార్ హీరోయిన్ ముందుగా నేను చేయనని చెప్పేసిందట. ఇక ఆ తర్వాత మళ్లీ తనే రియాలైజై ఆ సినిమా చేయడానికి ఒప్పుకుందట.
ఇక ఇంతకీ అది ఏ సినిమా ఆ హీరోయిన్ ఎవరు అంటే రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘కూలీ నెంబర్ 1’ సినిమాలో టబు ను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఆమె ఆ సినిమాను రిజెక్ట్ చేసింది. అలాగే వెంకటేష్ తో సినిమాను చేయనని కూడా చెప్పిందట… దాంతో రాఘవేంద్రరావు ఈ సినిమాలో వేరే హీరోయిన్ ను తీసుకుందామనే ప్రయత్నం చేస్తున్నప్పుడు టబు మళ్ళీ మనసు మార్చుకొని కూలీ నెంబర్ వన్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
అయితే ఈ క్రమంలో ఏం జరిగింది అంటే వెంకటేష్ లాంటి స్టార్ హీరో తో సినిమాలు చేస్తే నీకు మంచి మార్కెట్ కూడా క్రియేట్ అవుతుందని టబు సన్నిహితులు చెప్పడంతో ఆమె తన మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. మొదట ఆమె ఈ సినిమా చేయను అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఆమె అంతకు ముందు చాలా సినిమాలు కమిట్ అయి ఉందట. తనకు రెస్టు లేకుండా షూటింగ్ ల్లో పాల్గొనడంతో హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయట. దాన్ని ఉద్దేశించే ఇప్పుడు ఈ సినిమా కమిట్ అయితే మళ్లీ ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో తను ముందుగా సినిమా చేయనని చెప్పిందట.
ఇక వెంకటేష్ తో సినిమా చేయను అనడానికి కారణం ఏంటి అంటే పెద్ద సినిమా అయితే చాలా ఇబ్బందులు ఉంటాయని అప్పటికే ఆమెకి హెల్త్ కొంచెం ఇబ్బంది పెట్టడమే కారణం అని ఆ తర్వాత తెలియజేసింది. అలాగే వెంకటేష్ కి సారీ కూడా చెప్పిందంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. ఇక మొత్తానికైతే వెంకటేష్ చేసిన ఈ సినిమా భారీ సక్సెస్ అవ్వడమో కాకుండా వెంకటేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా కూడా నిలిచింది. ఇక రాఘవేంద్రరావు వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలవడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…