https://oktelugu.com/

TDP : టీడీపీ గ్రాఫ్ పెరిగితేనే.. లేకుంటే కష్టం

వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా గెలవలేమని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మరి పవన్ నిర్ణయానుసారం ఏపీలో వచ్చే ఎన్నికల వాతావరణం ఉండనుంది. వైసీపీని ఓడించడానికి చంద్రబాబుతో పవన్ కలుస్తాడా? లేదా? అన్నది వేచిచూడాలి..

Written By:
  • Dharma
  • , Updated On : July 14, 2023 / 01:30 PM IST
    Follow us on

    TDP : ఏపీలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది కానీ.. మరోసారి జగన్ గద్దెనెక్కుతాడన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అదేలా అంటే సంక్షేమ పథకాలతో గెలుస్తాడని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. మరికొందరు మాత్రం టీడీపీ, జనసేన కలిస్తే మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు బీజేపీ తోడైతే మాత్రం నిలువరించగలరని మెజార్టీ ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి టీడీపీ ఒక్కటే వెళితే ఏంటన్న ప్రశ్నకు మాత్రం సమాధానమిచ్చే వారు కరువవుతున్నారు. ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు. అంటే టీడీపీ గ్రాఫ్ ఏం పెరగలేదన్న మాట.
    అయితే చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడు. ఇది చాలా సందర్భాల్లో తేలింది. ఎన్డీఆర్ కు పదవీవిచ్యుతుడ్ని చేసి.. ఆయన మరణంతో ప్రతికూల పరిస్థితుల్లో సైతం 1999 ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించారు. 2004 నుంచి పదేళ్ల పాటు అధికారానికి దూరమైనా టీడీపీని కాపాడుకుంటూ వచ్చారు. 2009లో ప్రజారాజ్యం ఆవిర్భావ సమయంలో సైతం సీనియర్లు పార్టీని వీడినా మనోధైర్యంతో ముందుకు సాగారు. అయితే నాటి పరిస్థితులు వేరు. నేడు వేరు. అప్పట్లో చంద్రబాబు వ్యూహాలు పనిచేశాయి. కానీ ఇప్ఫుడు బలమైన ప్రత్యర్థి ముందు చంద్రబాబు వ్యూహాలు పాతబడ్డాయి.
    ప్రస్తుతం ఏపీలో బలమైన ప్రత్యర్థి వైసీపీ ఉంది. అందునా అధికారంలో ఉంది. దూకుడ్ను కనబరుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం అంచున ఉందని సర్వే పల్స్ చెబుతున్నాయి. వైసీపీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత ఉన్న సమయంలో ఎలా సాధ్యమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జగన్ సర్కారుకు వ్యతిరేకత ఉన్నా.. టీడీపీ గ్రాఫ్ పెరగడం లేదన్నది మాత్రం వాస్తవం. దీనిని పెంచుకునేందుకు చంద్రబాబు, లోకేష్ లు ప్రయత్నిస్తున్నా పట్టుచిక్కడం లేదు. యువగళం పాదయాత్ర, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల నుంచి ఆశించిన మైలేజీ రావడం లేదు.
    గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయితే పోయిన 2019 ఎన్నికల్లోలాగా జగన్ కు మెజార్టీ సీట్లను ఇచ్చి గెలిపించగలరు. అదే వ్యతిరేకత గునక ఉంటే చచ్చుబడిన టీడీపీని ఇదే ప్రజలు మరోసారి అధికారంలోకి తీసుకురాగలరు.. ప్రజలు ఎప్పుడూ పరిపాలకులకే పట్టం కడుతారు. ఆ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. తన బలం సరిపోదు అనుకున్నప్పుడు చంద్రబాబు కచ్చితంగా పొత్తుల కోసం వెంపర్లాడుతారు. అయితే ఆ పొత్తుల కోసం ఏ పక్షం ముందుకు రానప్పుడు ఒంటరిగానైనా పోటీచేసి గెలిచే సత్తా బాబుకు ఉండాలి. అప్పుడే రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతారు. లేదంటే పొత్తుల కోసం చూస్తే టీడీపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయం.
    నిజానికి ఏపీలో ప్రస్తుతం వైసీపీ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలైన టీడీపీ బలం ఎంతమాత్రం సరిపోదు. అందుకే జనసేనతో టీడీపీ కలిస్తే ఖచ్చితంగా వైసీపీని ఓడించే అవకాశాలుంటాయి. అయితే ఈ పొత్తు పొడుస్తుందా? లేదా? అన్నది మాత్రం ప్రస్తుతం పవన్ చేతుల్లో ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే బంతిని పవన్ కోర్టులోకి నెట్టారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా గెలవలేమని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మరి పవన్ నిర్ణయానుసారం ఏపీలో వచ్చే ఎన్నికల వాతావరణం ఉండనుంది. వైసీపీని ఓడించడానికి చంద్రబాబుతో పవన్ కలుస్తాడా? లేదా? అన్నది వేచిచూడాలి..