Telangana Teacher Jobs: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను నిర్వహించింది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో టెట్ ను నిర్వహించాలన్న చర్చ సాగింది. మంత్రులు, అధికారుల మధ్య జరిగిన ఈ చర్చలో ఉపసంఘం టెట్ నిర్వహించాలని ఆమోదం తెలిపింది. కానీ ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు పూర్తి కాకుండా టెట్ ను నిర్వహించలేమని అధికారులు తెలిపారు. దీంతో ముందుగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తరువాత టెట్ ను నిర్వహించారు. అంటే వచ్చే సెప్టెంబర్ లో ఈ పరీక్ష ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
డీఎస్సీ రాయడానికి ముందుగా టెట్ ను నిర్వహిస్తారు. ఇందులో అర్హత పొందిన వారే డీఎస్సీని రాస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నప్పటి నుంచి మొదటి సారి 2016లో టెట్ ను నిర్వహించారు. ఆ తరువాత 2017, 2022లో మొత్తం మూడుసార్లు పరీక్ష రాశారు. 2016లో క్వాలిఫై అయిన వాళ్లు డీఎస్ సీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ వేయలేదు. ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలు 12 వేలు ఉన్నాయని చెబుతుండగా.. అనఫిషియల్ గా 22 వేల భర్తీ చేయాలని విద్యాశాఖ అంచనా వేసింది.
ఉపాధ్యాయుల కొరతతో చాలా పాఠశాలల్లో సరైన బోధన జరగడం లేదు. కొన్ని గ్రామాల్లో ఉపాధ్యాయులు లేని కారణంగా పాఠశాలలను మూసివేస్తున్నారు. అయితే ఇప్పటి వరక టెట్ ను నిర్వహించడమే గానీ టీచర్ల భర్తీకి ఎలాంటి నిర్ణయం వెలువడకపోతవడంతో నిరాశతో ఉన్నారు. ఈ సందర్భంగా మరోసారి టెట్ నిర్వహణపై నిర్ణయం తీసుకోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. 2022లో టెట్ నిర్వహించిన తరువాత కొన్ని కోర్టు కేసుల కారణంగా ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. ఈసారం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రస్తుతం టెట్ నిర్వహణ అసాధ్యమని చెప్పారు. ఉపాధ్యాయులు బదిలీ ప్రక్రియ పూర్తయిన తరువాతే టెట్ నిర్వహిస్తామని అంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల కోసంఎదురుచూస్తున్నారు. కొందరు కొన్ని నెలల కిందట స్పౌజ్ లు రెడ్డెక్కిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. కానీ సెప్టెంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఉంటుందని తెలుస్తోంది.