Cat Video Viral: అమ్మతనం.. ప్రతి జీవికి ఓ వరం. తల్లి కావాలని ప్రతీ స్త్రీ జీవి ఆశపడుతుంది. అమ్మతనం కోసం పరితపిస్తుంది. సంతానం కలగక ఎంతోమంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సంతానం కలిగన వారు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ మురిసిపోతున్నారు. జంతువులు కూడా అంతే. తమ పిల్లల విషయంలో ప్రత్యే శ్రద్ధ తీసుకుంటాయి. కాకి అయినా.. కుక్క అయినా.. కోతి అయినా.. పిల్లి అయినా.. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తాయి. ఇక్కడ ఓ పిల్లి తన పిల్ల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంది. కానీ.. జంతువులు తమ పిల్లల విషయంలో చూపుతున్న కేర్.. నేటి మనుషుల్లో కొరవడుతోంది. అందుకే యువతరం గాడితప్పుతోంది.
పిల్లి ఏం చేసిందంటే..
ఓ పిల్ల పిల్లలను శత్రువుల కంట పడకుండా ఓ చోట ఉంచింది. సంతానం తర్వాత స్థానాలు మార్చడం పిల్లికి అలవాటు. ఇలాగే తన పిల్లలను జాగ్రత్త పర్చింది. అయితే అందులోని ఓ గడుసు పిల్లిపిల్ల.. స్థావరం నుంచి బయటకు వచ్చింది. ఇంకా బుద్ధి రాకపోవడంతో తాను వచ్చిన దారి మర్చిపోయి ఓ చోట కూర్చుంది.
తల్లడిల్లిన తల్లి..
ఆహారం కోసం వెళ్లి పిల్లల వద్దకు వచ్చిన తల్లి పిల్లికి ఓ పిల్ల కనిపించలేదు. దీంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. శత్రువు దాడిచేస్తే అన్నిటినీ చంపేస్తాడు.. కానీ ఒక్కటే మిస్ అయింది కాబట్టి దాటి తప్పి ఉంటుందని భావించింది. పిల్లను వెతకడం ప్రారంభించింది. స్థానవరానికి కాస్త దూరంలో దారితప్పిన పిల్లిపిల్ల కూర్చుండిపోయింది. అక్కడికి వెళ్లిన తల్లి లాగు గువ్వపై ఒక్కటిచ్చింది. తర్వాత నోట కర్చుకుని స్థావరానికి తీసుకెళ్లింది. ఇక్కడ దారితప్పిన పిల్లను దారిలో పెట్టేందుకే ఒక్కటి ఇచ్చింది.
ఈ శ్రద్ధ లేకనే దారితప్పుతున్న యువతరం..
పిల్లికి తన పిల్లలపై ఉన్న శ్రద్ధ.. నేడు తల్లిదండ్రుల్లో కొరవడింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో పెద్దల మాటను అందరూ గౌరవించేవారు. పిల్లల బాగోగులను కూడా అందరూ చూసుకునేవారు. ఉమ్మడి కుటుంబాలతోపాటే.. శ్రద్ధ కూడా తగ్గుతోంది. కలిసి ఉండడం కంటే విడిపోయి ఉండడం మేలని తల్లిదండ్రులు అనుకున్నట్లుగానే.. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. దానికి స్వేచ్ఛ అని పేరుపెట్టుకుని ఇష్టానుసారం తిరుగుతున్నారు. అర్ధరాత్రిళ్లు ఇళ్లకు రావడం, చేయకూడని పనులు చేయడం.. తప్పు జరిగాక తల్లిదండ్రుల వద్దకు రావడం వంటి అనేక ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. తల్లిదండ్రులు కూడా బిజీ లైఫ్‌తో పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయం పట్టించుకోవడం లేదు. తెలివిగలవారని నమ్మకంతో వదిలేస్తున్నారు. కానీ చాలా మంది తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. తాము చేసేదే రైట్ అనుకుంటున్నారు. ఈ పిల్లిని చూసి కొంతమందిలో అయినా మార్పు వస్తే అదే పదివేలు!