AP MLC Election: ఏపీలో ( Andhra Pradesh) ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. అయితే ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 20న ఎన్నిక జరగనుంది. దీంతో అన్ని పార్టీల్లో ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఈ ఐదు ఎమ్మెల్సీ పదవులు కూటమి పార్టీలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఐదు పదవుల్లో జనసేనకు ఒకటి ఖాయమని ప్రచారం నడిచింది. మెగా బ్రదర్ నాగబాబును మంత్రి చేస్తారన్న కోణంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని అంతా భావించారు. కానీ అక్కడే వ్యూహం మారింది. నాగబాబుకు రాజ్యసభకు పంపిస్తారని కొత్త ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే బిజెపికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖాయంగా తెలుస్తోంది.
Also Read: ఫాఫం.. పోసానిని తిప్పిన చోట తిప్పకుండా తిప్పుతున్నారే?
* సోము వీర్రాజు ప్రయత్నం
బిజెపిలో( Bhartiya Janata Party) చాలామంది ఆశావహులు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఛాన్స్ దక్కని నేతలు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. అటువంటి నేతల్లో సోము వీర్రాజు ఒకరు. ఏపీ బీజేపీ చీఫ్ గా కూడా వ్యవహరించారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. అయితే సోము వీర్రాజు విషయంలో టిడిపి నుంచి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలురు అన్న ముద్ర కూడా ఉంది. ఆయన ఏపీ బీజేపీ చీఫ్ గా ఉండే సమయంలో తెలుగుదేశం పార్టీ పట్ల అనుచితంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తును కూడా వ్యతిరేకించారు. అందుకే ఆయన విషయంలో టిడిపి శ్రేణులనుంచి కూడా అభ్యంతరాలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో అనపర్తి సీటును ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కున్నారు. ఇప్పుడు కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
* అనంతపురం జిల్లా నేతకు..
మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ( Vishnuvardhan Reddy) సైతం ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. బిజెపిలో ఈయన సీనియర్ మోస్ట్ లీడర్. బిజెపి అగ్ర నేతలతో సైతం పరిచయాలు ఉన్నాయి. అయితే ఈయన సైతం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకి అనే ముద్ర ఉంది. పార్టీ పొత్తుల విషయంలో సైతం చాలా సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. టిడిపి తో బిజెపి పొత్తు వద్దని వాదించిన నేతలు ముందు వరుసలో ఉంటారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. కానీ కూటమి పార్టీలు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
* మాధవ్ కు అనుకూలం
మరోవైపు ఉత్తరాంధ్రాకు చెందిన పివిఎన్ మాధవ్( pvn Madhav) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన సైతం ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. గతంలో టిడిపి సహకారంతోనే ఈయన ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ పట్ల మంచి భావనతోనే ఉండేవారు. టిడిపి నేతలతో సమన్వయంగా పనిచేసుకునేవారు. పైగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. అందుకే బిజెపికి ఇచ్చే ఏకైక ఎమ్మెల్సీ పదవి పివిఎన్ మాధవ్ కేనని ప్రచారం నడుస్తోంది. మరి అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.