ఒకరి తర్వాత ఒకరు భలే తగులుకున్నారు… ఆర్కే కి ఊపిరి ఆడుతోందా?

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎం.డి వేమూరి రాధాకృష్ణ ఇటీవల కాలంలో బిజెపి నుండి అనేక చావుదెబ్బలు తింటున్నారు. అటువైపు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం అవుతున్నా…. ఆయన పరమ భక్తుడు ఆర్కేకు మాత్రం ఆ పార్టీ పై, ఆ పార్టీ అధినాయకుడి పై భక్తి చావలేదు. దీంతో తన వారాంతపు పలుకులో పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ అభాసు పాలు అవుతున్నారు. Also Read : జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా? గత ఆదివారం రాసిన […]

Written By: Navya, Updated On : August 25, 2020 12:59 pm
Follow us on

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎం.డి వేమూరి రాధాకృష్ణ ఇటీవల కాలంలో బిజెపి నుండి అనేక చావుదెబ్బలు తింటున్నారు. అటువైపు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం అవుతున్నా…. ఆయన పరమ భక్తుడు ఆర్కేకు మాత్రం ఆ పార్టీ పై, ఆ పార్టీ అధినాయకుడి పై భక్తి చావలేదు. దీంతో తన వారాంతపు పలుకులో పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ అభాసు పాలు అవుతున్నారు.

Also Read : జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?

గత ఆదివారం రాసిన కొత్తపలుకు వ్యాసం చాలా వివాదాస్పదమైన విషయం తెలిసిందే.మీ జీవితం మీ ఇష్టం అంటూ బీజేపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్కె అక్షర విన్యాసం చేశారు. అయితే వెంటనే సోము వీర్రాజు ఆర్కే కు సరైన రీతిలో బుద్ధి చెప్పడం జరిగింది. జీవీఎల్ పై ఆర్కే చేసిన కామెంట్లకు వీర్రాజు రిప్లై ఇస్తూ గతంలో అడ్డగోలుగా మోడీని అతని కుటుంబాన్ని, బీజెపీ ని టార్గెట్ చేసిన మీకు ఒక్కసారిగా మా పార్టీ పై ఇంత ప్రేమ పుట్టిందని… ఆంధ్రప్రదేశ్లో మేము ఎదగడం లేదని మీరు ఇంతలా బాధ పడుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. చంద్రబాబు గారిని రక్షించే ప్రయత్నాలు మీరు మానుకోకపోతే కష్టమని…. ఇంత నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకొని మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మీకు తగునా? అంటూ బహిరంగంగానే ఒక ఉత్తరం రాసి… ఆర్కె వీపు విమానం మోత మోగించారు

ఇక వీర్రాజు నుండి స్ఫూర్తి తీసుకున్నారో ఏమో జివిఎల్ కూడా మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా.. ఆర్కేకు ఎక్కడ తగలాలో అక్కడ తగలాల్సిన మాటలు మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ తరహాలోనే టిడిపి కూడా ఉంది. ఏపీలో టీడీపీ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ప్రజల అభిమానం చూరగొని అధికారంలోకి వస్తుందన్న నమ్మకం నాకుంది. తెలుగు దేశం పార్టీని అభిమానించే పత్రిక అధినేత ఉన్నారు. కాంగ్రెస్ టిడిపిలను కూడా “మీ రాహుల్ మీ ఇష్టం…. మీ లోకేష్ మీ ఇష్టం” అని అంటారో లేదో చూడాలి అంటూ చణుకులు విసిరారు.

Also Read : అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?

ఇటీవల కాలంలో వీర్రాజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఎల్లో మీడియా వారి పార్టీని ఒక మాట అనాలంటేనే భయపడి చస్తుంది. ఇన్ని రోజులు బిజెపిని ప్రజల్లో ఏపీ బిజెపి ని అభాసుపాలు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేసిన ఎల్లోమీడియా డ్రామాలకు చెక్ పెట్టాలా సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ పావులు కదుపుతోంది. ఏబిఎన్ ఆర్కే కి ఈ విషయాలన్నీ మింగుడుపడుతున్నాయా…?