ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ నగరం వరుస బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. 2007 ఆగస్టు 25న సాయంత్రం హైదరాబాద్ మహానగరం బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొద్దినిమిషాల వ్యవధిల్లోనే నగరంలో వరుస బాంబు పేలుళ్లతో నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిపోయింది. ఈ సంఘటనలో 42మంది మృత్యువాతపడగా వందలాది మంది క్షతగాత్రులుగా మారారు.
Also Read: అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ టార్గెట్ ఇదే…!
ఈ సంఘటన జరిగి 13ఏళ్లు కావస్తున్నా నేటికి నగరానికి ఈ విషాద ఘటన మానని గాయంగా కన్పిస్తోంది. జంట పేలుళ్ల ఘటన గుర్తు చేసుకుంటేనే నగరవాసుల గుండెల్లో నేటికీ వణుకుపుడుతోంది. 2007 ఆగస్టు 25 సాయంత్రం 7.15 నిమిషాలకు నగరంలోని లుంబీని పార్క్‌లో తొలి బాంబు పేలింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే కోఠిలోని గోకుల్ చాట్‌లో మరో బాంబు పేలింది. లుంబినీపార్క్ పేలుడులో తొమ్మిది మంది, గోకుల్ చాట్ వద్ద 33మంది మృత్యువాతపడగా వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల రోధనలతో ఆప్రాంతమంతా భీతిల్లిపోయింది.
Also Read: బండిగారు… స్పీడ్ తగ్గించండి!
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నగరంలోని రద్దీ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 19బాంబులను బాంబ్ స్క్వాడ్ బృందం గుర్తించి నిర్వీరం చేసింది. జంట పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్ సంస్థ హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. మక్కా పేలుళ్ల అనంతరం పోలీసుల కాల్పులకు ప్రతీకారంగా నిందితులు పేలుళ్లు జరిపినట్టు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఏ-1 గా ఉన్న హానిక్ షఫిక్ సయ్యద్, ఏ-2 మహమ్మద్ ఇస్మాయిల్ చౌదరి లను దోషులుగా తేల్చి ఎన్ఐఏ కోర్టు శిక్ష ఖరారు చేసింది. నేటికి తీర్పు అమలు కాకపోవడం శోచనీయంగా మారింది. కాగా నాటి భయంకర పరిస్థితులు నేటికి నగరానికి మాననిగాయంగా కన్పిస్తోంది.