https://oktelugu.com/

‘ఆచార్య’ మోషన్ పోస్టర్ పై వివాదం

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ చిత్రం రానుంది. ఈ మూవీ ఇప్పటికే దాదాపు 40శాతం షూటింగు పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగు నిలిచిపోయింది. త్వరలోనే ‘ఆచార్య’ను పట్టాలెక్కించేందుకు దర్శకుడు కోరటాల శివ సన్నహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ‘ఆచార్య’పై ఓ వివాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. Also Read: సుశాంత్ ను చంపి ఉరితీశారా? సీబీఐ విచారణలో కొత్త కోణం? చిరంజీవి 65వ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 25, 2020 / 12:34 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ చిత్రం రానుంది. ఈ మూవీ ఇప్పటికే దాదాపు 40శాతం షూటింగు పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగు నిలిచిపోయింది. త్వరలోనే ‘ఆచార్య’ను పట్టాలెక్కించేందుకు దర్శకుడు కోరటాల శివ సన్నహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ‘ఆచార్య’పై ఓ వివాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: సుశాంత్ ను చంపి ఉరితీశారా? సీబీఐ విచారణలో కొత్త కోణం?

    చిరంజీవి 65వ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆచార్య ఫస్టు లుక్, మోషన్ పోస్టర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఈ మోషన్ పోస్టర్ చూపించిన ధర్మస్థలి సన్నివేశం తన కథ నుంచి కాపీ చేశారని రచయిత అనిల్ కృష్ణ ఆరోపిస్తున్నారు.

    2006లో పుణ్యభూమి అనే టైటిల్‌తో పేరుతో తాను ఓ కథను రచయితల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించున్నట్లు తెలిపాడు. ఆచార్య మోషన్ పోస్టర్‌లో చూపిన ధర్మస్థలి సన్నివేశం తన కథలోని దేనని అనిల్ కృష్ణ ఆరోపిస్తున్నాడు. దీంతో ఆచార్య మూవీ కాపీ కథేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనిపై దర్శకుడు కోరటాల శివ ఎలా స్పందిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది.

    Also Read: రానా ‘హిరణ్య కశ్యప’లో అల్లు అర్జున్‌?

    ఇక ఈ సినిమాలో చిరంజీవితోపాటు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరంజీవికి జోడీగా కాజల్ ఆగర్వాల్ నటిస్తుండగా ఓ స్పెషల్ సాంగులో రెజీనా ఆడిపాడింది. మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి మూవీకి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.