Omicron effect: అందరూ కరోనా మహమ్మారి ఇక అంతం అయిందనుకున్నారు. కానీ, అది మరోలా రూపాంతరం చెందింది. ఇంకో రూపం దాల్చి భయపెడుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ ఆనాటి పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్ బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు మళ్లీ చర్యలు షురూ చేశాయి. ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసుల పరిస్థితేంటి.. తీసుకుంటున్న చర్యలేంటి.. అనే విషయాలపై ఫోకస్..

కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాల ప్రకారం దేశంలోని రాష్ట్రప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినతరం చేశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షల విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. మాస్కు మస్ట్ అనే నిబంధన మళ్లీ స్టార్ట్ అయింది. మాస్క్ ధరించకుంటే రూ.1,000 జరిమానా అమలవుతున్నది. అయితే, దేశంలో రోజురోజుకూ ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చికిత్స కంటే నివారణే మేలు అన్న ఉద్దేశంతో ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొవిడ్ రూల్స్ కంపల్సరీ పాటించాలని పేర్కొంది. ఓపెన్ ప్లేసెస్, షాప్స్ , కాంప్లెక్సెస్, షాపింగ్ మాల్స్‌లో మాస్కు మస్ట్ అన్న నిబంధన దాదాపుగా అందరూ పాటిస్తున్నారు. మాస్కులు లేని వారిని షాప్స్‌లోకి అనుమతించడం లేదు. ఒకవేళ అలా అనుమతిస్తే రూ.25 వేల వరకు అధికారులు ఫైన్ కూడా వేస్తున్నారు.
ఏపీ సర్కారు కరోనా నిబంధనలు మరింత కఠినతరం చేసింది. ప్రతీ ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. నిబంధనల ఉల్లం‘ఘనుల’పై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. రూల్స్ పాటించని వారి గురించి 8010968295 నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పింది. ఈ నెంబర్‌కు వాట్సాప్ కూడా చేయొచ్చంది. రూల్స్ అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లను ఏపీ సర్కారు ఆదేశించింది.
Also Read: Andhra Pradesh: కేంద్రంపై మరో ఉద్యమానికి ఆంధ్రుల రెడీ
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది. ఇక ఏపీకి వచ్చే విదేశీ ప్రయాణికులపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రత్యేక వైద్య బృందాల ద్వారా నిరంతరం విదేశీ ప్రయాణికులను పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కొవిడ్ రావడంతో.. అతనికి ఒమిక్రాన్ టెస్ట్ కండక్ట్ చేశారు. రిజల్ట్ రావాల్సి ఉంది. అనంతపురం జిల్లాలోనూ ముగ్గురు వ్యక్తులకు కూడా ఒమిక్రాన్ టెస్టులు నిర్వహించినట్లు సమాచారం.
Also Read: AP cabinet expansion: మంత్రివర్గ విస్తరణపై జగన్ ఎందుకు ముందడుగు వేయడం లేదు?