https://oktelugu.com/

Mee Seva: ‘మీ సేవ’లో పెరిగిన సేవలు.. ఎలా పొందాలంటే

Mee Seva: నేషనల్ ఈ- గవర్నమెంట్ ప్లాన్ లో భాగంగా.. గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు ఈ పోర్టల్ ని డెవలప్ చేస్తోంది. ఏపీలో మీ సేవలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు సేవలు పొందుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 18, 2024 / 05:21 PM IST

    AP Meeseva

    Follow us on

    Mee Seva: వైసీపీ సర్కారు వచ్చాక ఏపీలో మీసేవ పోర్టల్ లో చాలా రకాల సేవలు తగ్గాయన్న విమర్శ ఉంది. సచివాలయ వ్యవస్థతో మీసేవ కేంద్రాల్లో సేవలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీసేవ పోర్టల్ లో చాలా సేవలను చేర్చింది. నేషనల్ ఈ- గవర్నమెంట్ ప్లాన్ లో భాగంగా.. గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు ఈ పోర్టల్ ని డెవలప్ చేస్తోంది. ఏపీలో మీ సేవలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు సేవలు పొందుతున్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో హోటల్లో కూడా చాలా మార్పులు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.

    Also Read: Andhra Pradesh: ఏపీకి గుడ్‌ న్యూస్‌ చెప్పి కేంద్రం.. చంద్రబాబు ఫుల్‌ ఖుషీ !

    మీసేవ పోర్టల్ లో సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దగ్గర్లోని మీసేవ కేంద్రాలకు వెళ్లి ఈ సేవలు పొందవచ్చు. కొద్దిపాటి రుసుం చెల్లించి ఆ సేవలను పొందవచ్చు. ప్రధానంగా ఆధార్ సేవలు, సిడిఎంఏ, వ్యవసాయ శాఖ సేవలు, ప్రజా పంపిణీ సేవలు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ కమిషన్, జిల్లా పాలన యంత్రాంగం సేవలు, పోలీస్ సేవలు, విద్యాశాఖ సేవలు, ఎన్నికల సేవలు, ఉద్యోగ సేవలు, హౌసింగ్, ఎండోమెంట్, ఆరోగ్య సేవలు, ఐటిసి, కార్మిక సేవలు, లీగల్ మెట్రాలజీ, మైన్స్, జియాలజీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, మునిసిపల్ అడ్మిన్, ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్, ఎన్డీపీసీఎల్, రెవెన్యూ, గ్రామాభివృద్ధి, సోషల్ వెల్ఫేర్.. ఇలా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు పొందవచ్చు.

    Also Read: YCP Seniors : కాంగ్రెస్ వైపు చూస్తున్న వైసీపీ సీనియర్లు?

    మీసేవ ద్వారా సేవలు పొందాలంటే కొన్ని పత్రాలు అవసరం. ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరం. మీ సేవలో సేవలు పొందాలంటే ముందుగా అధికారిక పోర్టల్ లోకి వెళ్ళాలి. హోం పేజీలో మీరు మీ సేవ ఆన్లైన్ పోర్టల్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్ పైన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ ముందు రిజిస్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది. అందులో అడిగిన వివరాలు ఎంటర్ చేయాలి. తరువాత మీ మొబైల్ కి ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మీకు కన్ఫర్మేషన్ కోసం మెయిల్ ఐడి కి ఈమెయిల్ వస్తుంది. అందులో ఉన్న కోడ్ ని క్లిక్ చేయాలి. దీంతో మీ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. తరువాత లాగిన్ కావాలి. సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీకు డాష్ బోర్డు కనిపిస్తుంది. అందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు రకరకాల సేవలను అక్కడ చూస్తారు. వాటి కోసం అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న క్రమంలో కొన్ని పత్రాలను అడుగుతుంది. వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వివిధ పథకాలు, సేవల కోసం అప్లై చేసుకున్నాక.. వాటి పరిస్థితి ఎలా ఉందో స్టేటస్ కూడా చూసుకోవచ్చు.