https://oktelugu.com/

Moon Mysteries : చంద్రుడి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

. భూమి నుంచి చూస్తే సూర్యుడు, చంద్రుడు ఒకే సైజులో ఉన్నారని కనిపిస్తుంటారు కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుందట. చంద్రుడి సైజు కన్నా సూర్యుడి పరిమాణం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది అంటుందట.

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2024 / 05:25 PM IST

    moon mysteries

    Follow us on

    Moon Mysteries : చంద్రుడి గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. భూమి ఆవిర్భవించిన సమయంలోనే చందమామ కూడా ఏర్పడిందంటారు సైంటిస్టులు. అయితే మిగతా శాటిలైట్‌లతో పోలిస్తే చంద్రుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సౌర వ్యవస్థలోనే రెండో అత్యధిక సాంద్రత కలిగిన, భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడే అంటారు. అందుకే చందమామ మీద చాలా పరిశోధనలు జరుగుతుంటాయి. అయితే చంద్రుడికి సంబంధించిన, పెద్దగా తెలియని ఆసక్తికర విషయాలను ‘ద రాయల్ మ్యూజియం గ్రీనిచ్’ రీసెంట్ గా కొన్నింటి గురించి వెల్లడించింది.అందులో కొన్ని మీకోసం..

    అంగారక గ్రహం సైజుకి సమానమైన ఓ రాయి భూమిని ఢీకొట్టడంతో చందమామ ఏర్పడిందట. వేల ఏళ్ల క్రితమే ఈ ప్రక్రియ జరిగిందంటారు శాస్త్రజ్ఞులు. అయితే చంద్రుడిపై నీటి ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అయితే భూమిపై ఉన్నట్లు ద్రవ రూపంలో కాకుండా చంద్రుడిపై ఘన రూపంలో ఉందట నీరు. చంద్రుడి ఉపరితలంపై ఐస్ ఉండటంతో అక్కడ వాతావరణం చాలా కూల్‌గా ఉంటుంది అని తెలుస్తోంది. సముద్రంలో కొన్ని రకాల తరంగాలు ఏర్పడతాయనే విషయం తెలిసిందే. ఇదే విధంగా చంద్రుడిపై కూడా తరంగాలు ఉంటాయట. కాకపోతే, అక్కడ ‘రాక్ టైడ్స్’ మాదిరి ఏర్పడతాయని.. ఇవి బయటకు కనిపించవని అంటున్నారు.

    భూమిపై ఏర్పడే భూకంపాల మాదిరిగానే చంద్రుడిపై కంపనాలు కూడా సంభవిస్తాయట. వీటిని మూన్‌క్వేక్స్ అంటారు. చంద్రుడి అంతర్భాగంలో జరిగే కదలికలు, పీడనాల కారణంగా మూన్‌క్వేక్స్ ఏర్పడుతాయి అంటున్నారు పరిశోధకులు. అయితే ఇవి అరగంట పాటు వస్తాయట. చంద్రుడి భ్రమణమే ఆసక్తి కలిగించే విషయం. భూమి నుంచి చూస్తే చంద్రుడి ఉత్తరార్ధ గోళమే మనకు కనిపిస్తుంది. దక్షిణార్ధ గోళం కనిపించదు. దీనికి కారణం చంద్రుడి సమకాలిక భ్రమణం చేయడం.

    ఏటా చంద్రుడు భూమికి కాస్త దూరం అవుతున్నాడట. చంద్రుడి పరిభ్రమణ కక్ష్య కూడా వ్యాపిస్తుందట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..చాలా మంది కవులు, రచయితలు చందమామను అందమైనదిగా వర్ణిస్తుంటారు. కానీ, వాస్తవానికి చంద్రుడు అందంగా ఉండడట. జాబిల్లి ఉపరితలం సమతలంగా ఉండదు, పూర్తిగా చీకటిగా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. భూమి నుంచి చూస్తే సూర్యుడు, చంద్రుడు ఒకే సైజులో ఉన్నారని కనిపిస్తుంటారు కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుందట. చంద్రుడి సైజు కన్నా సూర్యుడి పరిమాణం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది .