Alapati Rajendra Prasad: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో( MLC elections )టిడిపి అభ్యర్థుల పరిస్థితి ఏంటి? గెలిచే ఛాన్స్ ఉందా? ఎదురీదుతున్నారా? వంటి చర్చ నడుస్తోంది. అయితే టిడిపి కూటమికి బలమైన ప్రాంతాలు కావడం, చేతిలో అధికారం ఉండడం, బలమైన అభ్యర్థులను బరిలో దించడంతో టిడిపి కూటమికి తప్పకుండా విజయం దక్కాలి. కానీ గత అనుభవాల దృష్ట్యా ఓ రకమైన ఆందోళన మాత్రం కనిపిస్తోంది. ప్రధానంగా కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజా గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పిడిఎఫ్ అభ్యర్థికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో.. ఈజీగా గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు తెలుగుదేశం పార్టీకి. అందుకే ఆ రెండు జిల్లాల నేతలను సీఎం చంద్రబాబు దిశ నిర్దేశం చేశారు. దీంతో ఒక్కసారిగా నేతలు అలర్ట్ అయ్యారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
,* దూకుడు స్వభావం
ఆలపాటి రాజేంద్రప్రసాద్( alapati Rajendra Prasad ) ది దూకుడు స్వభావం. గతంలో ఆయన మంత్రిగా కూడా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి మంత్రి కావాలన్నది ఆయన ధ్యేయం. అయితే జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఆయన ప్రయత్నానికి అడ్డుపడ్డారు. పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు చంద్రబాబు. అయితే అప్పటివరకు టిడిపి టికెట్ వస్తుందని భావించిన ఆలపాటి రాజా తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయిష్టంగానే నాదేండ్ల మనోహర్ కు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అప్పట్లో సహాయ నిరాకరణ చేశారని జనసేన వర్గాలు ఆలపాటి రాజా పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అందుకే అక్కడ జనసేన పెద్దగా యాక్టివ్ గా పని చేయడం లేదని తెలుస్తోంది.
* నగర నేతలు దూరంగా..
ఇంకోవైపు గుంటూరు నగరంలోని( Gunturu City ) టిడిపి తో పాటు కూటమి నేతలు ఆలపాటి రాజాకు పెద్దగా సహకరించడం లేదని టాక్ నడుస్తోంది. గతంలో నగర రాజకీయాల్లో రాజా ప్రవేశించారని.. అనేక వివాదాలకు కారణమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే నగరానికి చెందిన కూటమి ఎమ్మెల్యేలు పెద్దగా ప్రచారం చేయడం లేదు. కేవలం హై కమాండ్ ఆదేశించిందని మాత్రమే తూతూ మంత్రంగా కొన్ని పనులు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒకవేళ ఆలపాటి రాజా ఎమ్మెల్సీగా గెలిస్తే గుంటూరు నగరంలో అధికారాన్ని చూపిస్తారని మిగతా నేతల్లో అనుమానం ఉంది. అందుకే సహాయ నిరాకరణ చేస్తున్నట్లు సమాచారం.
* బాహటంగానే ఆ సీనియర్ వ్యతిరేకత
మరోవైపు టిడిపి సీనియర్ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర( dulapalla Narendra ) ఆలపాటి రాజాకు చెక్ చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. సంగం డైరీ వివాద సమయంలో ఆలపాటి రాజా దూళిపాళ్ల నరేంద్రకు ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఆలపాటి రాజాకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలిపే ప్రసక్తి లేదని దూళిపాళ్ల నరేంద్ర ప్రకటించినట్లు సమాచారం. అయితే ఇలా నేతల సహాయ నిరాకరణ అంశం హై కమాండ్ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. పొరపాటున టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజా ఓడిపోతే పార్టీతో పాటు ప్రభుత్వం పై ప్రతికూలత చూపుతుందని.. ఆ పరిస్థితి రాకుండా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కూటమి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తున్నారు. మరి ఆయన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.