Sandeep Kishan
Sandeep Kishan : మంచి యాక్టింగ్ టాలెంట్ , దానికి తగ్గట్టుగా ఉండే స్క్రీన్ ప్రెజెన్స్, కటౌట్ ఉన్న హీరోలు దొరకడం చాలా కష్టం. మన ఇండస్ట్రీ లో అలాంటి హీరోలు కొంతమందే ఉన్నారు. ఆ కొంతమందిలో ఒకరు సందీప్ కిషన్. ఈయన మీడియం రేంజ్ హీరో నుండి, మరో లెవెల్ కి వెళ్ళేందుకు ఎంతో కాలం నుండి కష్టపడుతున్నాడు. కానీ అదృష్టం కలిసి రావడం లేదు. దాదాపుగా 30 సినిమాలు చేసాడు కానీ, కమర్షియల్ గా సక్సెస్ అయ్యినవి మాత్రం కేవలం మూడే. శర్వానంద్(Sharwanand) హీరో గా దేవాకట్టా దర్శకత్వం లో తెరకెక్కిన ‘ప్రస్థానం’ అనే చిత్రంలో సందీప్ కిషన్(Sandeep Kishan) ఒక కీలక పాత్ర పోషించాడు. ఈ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆయనకు వరుసగా హీరో అవకాశాలు వచ్చాయి. ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ అనే చిత్రం ఈ హీరో కెరీర్ లో పెద్ద హిట్ గా నిల్చింది.
ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ ఈ హీరో కెరీర్ లో పడలేదు. కానీ గత ఏడాది ఆయన నటించిన ‘భైరవకోన’ చిత్రం మాత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో ట్రాక్ లోకి వచ్చేసిన ఈ కుర్ర హీరో తదుపరి చిత్రాలను కూడా మినిమం గ్యారంటీ గా ఉండేలా చూసుకుంటున్నాడు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మజాకా'(Majaka Movie) ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఉంది అనే నమ్మకాన్ని కలిగించింది ఈ చిత్రం. ఇక మూవీ టీం కూడా ప్రొమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.
సందీప్ కిషన్ అందులో భాగంగా వరుసపెట్టి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ‘ఒక అమ్మాయితో నాలుగేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన విషయం వాస్తవమే. కానీ ఎందుకో మా ఇద్దరి మధ్య సెట్ అవ్వలేదు, ఫ్రెండ్లీ గానే విడిపోయాము. ప్రస్తుతం నా జీవితంలో గర్ల్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు కానీ, అమ్మాయిలలో స్నేహితులు మాత్రం ఉన్నారు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గతంలో సందీప్ కిషన్ ప్రముఖ యంగ్ హీరోయిన్ రెజీనా తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన బ్రేకప్ స్టోరీ చెప్పింది ఆమెని ఉద్దేశించే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే మజాకా చిత్రం పై సందీప్ కిషన్ కి ఉన్న నమ్మకం మామూలుది కాదు. కచ్చితంగా ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నాడు.