https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ వర్సెస్ అల్లు అర్జున్..అట్లీ మూవీ ప్లాన్ మామూలుగా లేదు!

ప్రస్తుతం మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో నేటి తరం స్టార్ హీరోలలో ఎలాంటి పాత్ర ని అయినా అద్బుతంగా పోషించగల అతి తక్కువమంది హీరోలలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun). ఆయన ఈమధ్య కాలం లో ఏ సినిమాలో కూడా నటించడంలేదు, జీవిస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదేమో. పుష్ప సిరీస్ దేశవ్యాప్తంగా అంతటి సంచలన విజయం సాదిమ్చడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అద్భుతమైన నటనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Written By: , Updated On : March 23, 2025 / 10:00 AM IST
Follow us on

Allu Arjun: ప్రస్తుతం మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో నేటి తరం స్టార్ హీరోలలో ఎలాంటి పాత్ర ని అయినా అద్బుతంగా పోషించగల అతి తక్కువమంది హీరోలలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun). ఆయన ఈమధ్య కాలం లో ఏ సినిమాలో కూడా నటించడంలేదు, జీవిస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదేమో. పుష్ప సిరీస్ దేశవ్యాప్తంగా అంతటి సంచలన విజయం సాదిమ్చడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అద్భుతమైన నటనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సుకుమార్(Director Sukumar) టేకింగ్ కూడా ఒక ముఖ్య కారణమే కానీ, స్టోరీ పరంగా చూసుకుంటే ఈ సిరీస్ పై చాలా విమర్శలే వచ్చాయి. ఆ విమర్శలన్నీ అల్లు అర్జున్ నటన ముందు తేలిపోయాయి. అందుకే దేశవ్యాప్తంగా ఆ చిత్రం అలాంటి ప్రభంజనం సృష్టించింది. ఆ క్యారక్టర్ ఇమేజ్ నుండి బయటకు రావడం అంత తేలికైన విషయం కాదు.

కానీ అల్లు అర్జున్ రాగలదు, అదే ఆయన టాలెంట్ కి నిదర్శనం. ప్రస్తుతం ఆయన అట్లీ(Director Atlee( చిత్రం లో హీరో గా చేయబోతున్నాడు. ముందుగా త్రివిక్రమ్ తో సినిమాని ప్రారంభించాలని అనుకున్నాడు కానీ, స్క్రిప్ట్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో ఆయన ముందుగా అట్లీ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని అనుకున్నాడు. రీసెంట్ గానే రెండు మూడు సార్లు స్టోరీ సిట్టింగ్స్ కూడా జరిగాయి. ఈ చిత్రం గురించి లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఒక క్యారక్టర్ పాజిటివ్ కాగా, మరో క్యారక్టర్ విలన్ అట. ఇలాంటి ప్రయోగాలు మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ హీరో కూడా చేయలేదు. ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ లో చేశాడు కానీ, అది పూర్తి స్థాయి నెగటివ్ క్యారక్టర్ కాదు. కానీ అల్లు అర్జున్ చేయబోతున్నది పూర్తి స్థాయి నెగటివ్ క్యారక్టర్.

ముందుగా విలన్ క్యారక్టర్ కోసం ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్ ని తీసుకుందామని అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ ఆ క్యారక్టర్ కూడా నేనే చేస్తాను, కచ్చితంగా ఈ ప్రయోగం సక్సెస్ అవుతుంది అని డైరెక్టర్ తో అన్నాడట. అందుకు అట్లీ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడట. డైరెక్టర్ అట్లీ కూడా వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని కోరుకుంటున్నాడు. ఇద్దరూ కూడా రెమ్యూనరేషన్ విషయం లో అసలు తగ్గడం లేదు. దీంతో మేకర్స్ కూడా వాళ్ళ డిమాండ్స్ కి దిగి రాక తప్పలేదు. ఈ ఏడాది ద్వితీయార్థం లో ఈ సినిమా షూటింగ్స్ సెట్స్ మీదకు వెళ్లనుంది.