Greater Visakhapatnam
Visakha : విశాఖ నగరపాలక సంస్థ ( greater Visakha Municipal Corporation )పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి పావులు కదుపుతోంది. మార్చి 18 తో జీవీఎంసీ పాలకవర్గ పదవీకాలం నాలుగేళ్లు ముగిసిన సందర్భంగా అవిశ్వాస తీర్మానానికి అవకాశం కలిగింది. ఈ తరుణంలో విశాఖకు చెందిన కూటమి నేతలు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద నగరపాలక సంస్థ అయిన జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోక తప్పదు. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జీవీఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ చివరి ఏడాది మాత్రం కూటమికి దక్కే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read : జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ.. అంతవరకు ఆగాల్సిందే : చంద్రబాబు
* కీలక నేతలు ఒక్కొక్కరు
ఈ ఎన్నికల్లో కూటమి( Alliance ) ఘన విజయం సాధించింది. దీంతో అప్పటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. విశాఖకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం పెద్ద ఎత్తున కూటమి పార్టీలో చేరారు. జీవీఎంసీ కి చెందిన మెజారిటీ కార్పొరేటర్లు సైతం కూటమి పార్టీలోకి వచ్చేశారు. ఎక్కువమంది తెలుగుదేశం పార్టీలో చేరగా.. మరికొందరు జనసేనలో చేరారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోయింది. కూటమి బలం అమాంతం పెరిగింది. ఆపై కూటమికి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల బలం కూడా ఉంది. అందుకే కూటమి మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
* కూటమికి పెరిగిన బలం
జీవీఎంసీలో( gvmc) 98 డివిజన్లు ఉన్నాయి. 2021 లో జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 58 డివిజన్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ 29 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. జనసేనకు మూడు సీట్లు వచ్చాయి. మరోవైపు బిజెపి ఒక స్థానాన్ని దక్కించుకుంది. ఇండిపెండెంట్లు సైతం గెలిచారు. అయితే ఎన్నికలకు ముందు.. ఫలితాలు వచ్చిన తర్వాత.. ఇటీవల పెద్ద ఎత్తున కార్పోరేటర్లు టిడిపి తో పాటు జనసేనలో చేరారు. దీంతో కూటమి బలం పెరిగింది. అందుకే మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలుస్తోంది.