https://oktelugu.com/

Kadambari Jetwani : నెక్స్ట్ ఐపీఎస్ లే.. ముంబై నటి కేసులో సీరియస్ యాక్షన్ స్టార్ట్!

ఎక్కడో ముంబైలో నమోదైన కేసును దృష్టిలో పెట్టుకొని.. ఓ నటిని వేధించారు, వెంటాడారు. అక్కడి కేసు విత్ డ్రా చేసుకోవాలని విజయవాడ తెచ్చి తప్పుడు కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే ఆ పోలీస్ ఉన్నతాధికారుల మేడకు చుట్టుకుంటోంది.

Written By:
  • Dharma
  • , Updated On : September 14, 2024 1:48 pm
    Kadambari Jetwani Case

    Kadambari Jetwani Case

    Follow us on

    Kadambari Jetwani : వైసిపి ప్రభుత్వ హయాంలో ముంబై నటి కాదంబరి జత్వానిని జైలుకు పంపి వేధించిన వ్యవహారం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోఆమెను వేధించినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీస్ శాఖ సమగ్ర దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు పడింది. మరికొందరిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇబ్రహీంపట్నంలో ముంబై నటిపై తప్పుడు కేసు పెట్టి వేధించారన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో కొందరు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.తాజాగా దిగువ స్థాయి అధికారులు,సిబ్బందిపై చర్యలు ప్రారంభమయ్యాయి.తదుపరి ఐపీఎస్ అధికారుల పైనేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి విజయవాడ కమిషనరేట్ ఏసిపి హనుమంతరావు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేసిన సత్యనారాయణను ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేశారు.

    * లోతైన దర్యాప్తు
    విజయవాడ వరదల నేపథ్యంలోఈ కేసు విచారణ పక్కకు వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు.కానీ లోతైన దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ముంబై నటి కేసులో తన పేరు బయటకు రాకుండా ఆమెను వేధించాలన్న ఓ పారిశ్రామికవేత్త సూచనల ప్రకారం..పోలీసులు పక్కా స్కెచ్ తో అరెస్టు చేశారు.ఆ తరువాత రిమాండ్ కు పంపారు. ఆ కుటుంబాన్ని పై పెట్టి తిరిగి ముంబైకి పారిపోయేలా చేశారు.ఈ మొత్తం వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దల్లో ఒకరు, ఓ ముగ్గురు ఐపీఎస్ ఉన్నతాధికారులు వ్యూహం పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    * కూటమి ప్రభుత్వం రావడంతో
    టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. సీరియస్ అంశంగా పరిగణించింది. అటు బాధితురాలు ముంబై నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. ప్రధానంగా నాటి ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని సూత్రధారులుగా ఆరోపణలు ఉన్నాయి. వారిపై సైతం వేటుపడే అవకాశం ఉంది.

    * ఐపీఎస్ అధికారుల్లో ఆందోళన
    మరోవైపు ఈ కేసు విషయంలో వైసీపీ నేతలు భయాందోళనకు గురవుతున్నారు.అటు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు సైతం సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం వారిని లూప్ లైన్ లో పెట్టింది. కనీసం అప్రాధాన్య పోస్టులను సైతం కేటాయించలేదు. ఇప్పుడు కొత్తగా కేసులు మెడకు చుట్టుకోవడంతో వారు మనస్థాపానికి గురవుతున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పాటించి అనవసరంగా బుక్కయ్యామని భావిస్తున్నారు.