Jumior NTR : దేవర కన్నడ డబ్బింగ్ చెప్పడం లో రికార్డ్ క్రియేట్ చేసిన జూనియర్ ఎన్టీయార్…

ఇక ఈ సినిమా భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న క్రమంలో రీసెంట్ గా కన్నడ భాషకు సంబంధించిన డబ్బింగ్ ని కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. కేవలం నాలుగు గంటల్లోనే తన పాత్ర మొత్తానికి డబ్బింగ్ చెప్పి ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇతర భాషల్లో అంత ఫాస్ట్ గా డబ్బింగ్ చెప్పలేదు.

Written By: Gopi, Updated On : September 14, 2024 1:52 pm

Junior NTR

Follow us on

Jumior NTR :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ పోటీని ఇస్తున్నాడు. మరి ఇలాంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న ‘దేవర ‘ సినిమాతో సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పనులన్నింటినీ పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న క్రమంలో రీసెంట్ గా కన్నడ భాషకు సంబంధించిన డబ్బింగ్ ని కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. కేవలం నాలుగు గంటల్లోనే తన పాత్ర మొత్తానికి డబ్బింగ్ చెప్పి ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇతర భాషల్లో అంత ఫాస్ట్ గా డబ్బింగ్ చెప్పలేదు.

కాబట్టి అందులో తను ఒక రికార్డునైతే క్రియేట్ చేశారనే చెప్పాలి. ఇక స్వతహాగా జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ,మలయాళం, కన్నడ భాషలు కూడా వచ్చు. కాబట్టి అందులో ఆయన తన పర్ఫెక్షన్ చూపిస్తూ చాలా స్పష్టంగా కూడా మాట్లాడగలుగుతాడు. అందుకోసమే ఆయన చాలా ఈజీగా డబ్బింగ్ పూర్తి చేసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి తోటి హీరోలతో పాటు తను కూడా పాన్ ఇండియా లో స్టార్ హీరోగా వెలుగొందితాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుల మదిలో మెదులుతుందా? ముఖ్యంగా ఆయన మాస్ సినిమా కి కేరాఫ్ అడ్రెస్ గా మారుతుంటారు.

ఇక బిసి సెంటర్లోమంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడం లో ఆయన చాలా ముందు వరుసలో ఉంటాడు. ఇక దేవర సినిమా కూడా మాస్ మసాలా సినిమా గానే కనిపిస్తుంది. ఇక ఈ సినిమా సూపర్ అయినప్పటికి ఈ సినిమాలో చాలా హై ఎలివేషన్స్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎమోషన్, ఎలివేషన్స్ తో దర్శకుడు ఈ సినిమాతో మ్యాజిక్ చేస్తాడా లేదంటే ఈ సినిమాని ఫ్లాప్ గా మారుస్తాడా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…