Women New Hostels in AP : విశాఖపట్నం పై( Visakhapatnam) కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఐటీ సంస్థలను తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంది. ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యింది. దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు వస్తున్నాయి. వాటికి ఏపీ ప్రభుత్వం భూ కేటాయింపులు కూడా చేసింది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో వర్కింగ్ ఉమెన్స్ కోసం మూడు హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకుగాను నిధులు కూడా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఆపై ఆంధ్ర యూనివర్సిటీ తో పాటు పేరు మోసిన విద్యాసంస్థలు ఉన్నాయి. తాజాగా ఐటీ సంస్థలు వస్తున్నాయి. దీంతో వాటిలో పనిచేసే మహిళలకు ఈ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వీలైనంత త్వరగా ఈ హాస్టల్స్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.113.52 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* విస్తరిస్తున్న నగరం..
విశాఖ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. కూటమి ప్రభుత్వం ఆర్థిక రాజధానిగా( economic capital) ప్రకటించిన సంగతి తెలిసిందే. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండడంతో నగరం కూడా విస్తరిస్తోంది. ముఖ్యంగా వివిధ రంగాల్లో మహిళలు ఎక్కువగా పని చేస్తున్నారు. అయితే వారికి సరైన హాస్టల్స్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖలో మూడు చోట్ల హాస్టల్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మధురవాడ, నరవ, మూడోసారి లోపల మూడు వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో వీటిని నిర్మాణం ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఈ హాస్టల్లో అందుబాటులోకి వస్తే మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయి.
Also Read : తెలంగాణలో రేషన్ కార్డుల రద్దు.. ఆ కార్డులపై కేంద్రం దృష్టి!
* కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మరోవైపు ఈ హాస్టళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం( central government) సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా ఈ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయనుంది కేంద్రం. విశాఖ నగరంలోని మూడు చోట్ల ఈ హాస్టల్స్ నిర్మాణం జరగనుంది. రూ.172 కోట్ల వ్యయంతో ఈ భవనాల నిర్మాణం జరగనుంది. జీవిఎస్సిసిఎల్ ఈ నిర్మాణాలను పిపిపి పద్ధతిలో చేపట్టనుంది. గతంలోనే మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మధురవాడ హాస్టల్ నిర్మాణానికి రూ.51.08 కోట్లు, నరవలో నిర్మాణానికి రూ.30.38 కోట్లు, మూడసర్లోవలో రూ.90.54 కోట్లు ఖర్చు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మూడు హాస్టల్స్ నిర్మాణానికి గతంలోనే అంగీకారం తెలిపింది.
* ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగు
విశాఖ నగరంలో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. రసాయనక పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా మహిళలు ఉపాధి కోసం విశాఖ నగరానికి వస్తున్నారు. ఇంకోవైపు దిగ్గజ ఐటీ సంస్థలు సైతం విశాఖలో అడుగుపెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ హాస్టల్స్ నిర్మాణం పూర్తయితే మహిళా ఉద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. వీలైనంత త్వరగా వీటిని నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.