Visakhapatnam: ఏపీ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రం నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ లకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం నుంచి అబుదాబికి విమాన సర్వీసులు జూన్ 13 నుంచి.. విశాఖ నుంచి భువనేశ్వర్ కు జూన్ 12 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. మరోవైపు విజయవాడ నుంచి బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు జూన్ రెండు నుంచి అందుబాటులోకి ఉంటాయి. విజయవాడ నుంచి విశాఖకు జూన్ 1 నుంచి ఇండిగో సంస్థ నూతన విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో విమాన కనెక్టివిటీని పెంచడానికి ఈ కొత్త విమానాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
* అబుదాబికి రద్దీ అధికం..
విశాఖ నుంచి అబుదాబికి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాంధ్ర నుంచి వలస కూలీలు అధికంగా ఉంటారు. అయితే నేరుగా విమాన సర్వీసులు రాలేకపోవడంతో అటు బెంగళూరు నుంచి కానీ.. ఇటు హైదరాబాదు నుంచి కానీ వెళ్లాల్సి వచ్చేది. అటువంటి వారి కోసం అబుదాబికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండడంతో.. ఉత్తరాంధ్ర ప్రజల కోరిక మేరకు జూన్ 13 నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విమానాలు వారానికి నాలుగు రోజులు పాటు నడవనున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లే వారితోపాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగు పడనుంది.
Also Read: Jagan Mohan Reddy : జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ.. హైకోర్టు కీలక ఆదేశాలు!
* విమాన కనెక్టివిటీ పెరుగుదల..
ఆంధ్రప్రదేశ్ కు విమాన కనెక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతోనే కొత్తగా ఈ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రధానంగా విజయవాడ, విశాఖ మధ్య విమాన సర్వీసులు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనిపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. అందుకే జూన్ 1 నుంచి 2 నగరాల మధ్య విమాన రాకపోకలు నేరుగా ప్రారంభం కానున్నాయి. మరోవైపు విశాఖ నుంచి ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ కు నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. అటు విజయవాడ నుంచి బెంగళూరుకు జూన్ 2 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు నడవనున్నాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం నుంచి బెంగళూరుకు సులువుగా చేరుకోవచ్చు.
Also Read: TDP Mahanadu 2025: మహానాడు ఏర్పాట్లకు ఆ జిల్లా నేతలు దూరం!
* జూన్ 1 నుంచి నూతన విమాన సర్వీస్..
విజయవాడ నుంచి విశాఖకు జూన్ 1 నుంచి నూతన విమాన సర్వీసును ప్రారంభిస్తున్నారు. ఇండిగో సంస్థ ఈ సర్వీసును నడపనుంది. ఉదయం 7:15 గంటలకు విజయవాడలో బయలుదేరి ఉదయం 8:25 గంటలకు చేరుకుంటుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ నుంచి విశాఖకు ప్రత్యేక సర్వీసులు లేవు. అటు హైదరాబాద్ కానీ.. ఇటు బెంగళూరు ను కానీ టచ్ చేయాల్సి వచ్చేది. ఆ అవసరం లేకుండా నేరుగా రెండు నగరాల మధ్య విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.