Nara Lokesh : టిడిపి యువ మంత్రి నారా లోకేష్ పై ( Nara Lokesh) పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో చెయ్యి కలుపుతారా అంటూ నిలదీసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసిన ఓ వ్యక్తి ప్రత్యేకంగా వచ్చి లోకేష్ ను కలిశారు. లోకేష్ తో చేతులు కలిపారు. కానీ ఆయన తనను దూషించిన వ్యక్తి అని లోకేష్ తెలుసుకోకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. లోకేష్ కంటే ఆయన చుట్టూ ఉన్న టీం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిడిపి శ్రేణుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని లోకేష్ కు వినతులు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో టిడిపి శ్రేణులు దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు.
Also Read : 20 లక్షల ఉద్యోగాలు.. తొలి ఏడాది ఐదు లక్షలు.. ప్రభుత్వ టార్గెట్ అదే.. లోకేష్ కీలక ప్రకటన!
* సిస్కోతో ఒప్పందం
రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో సిస్కో సంస్థతో( Cisco company) ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా నిన్ననే సిస్కో ప్రతినిధులు మంత్రి లోకేష్ ను ప్రత్యేకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సమ్మతించారు. ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సిస్కో ప్రతినిధులతో లోకేష్ ఉన్న ఫోటో వైరల్ గా మారింది. అయితే సిస్కో బృందంలో ఓ వ్యక్తిని గుర్తించిన టిడిపి శ్రేణులు లోకేష్ తీరుపై మండిపడడం ప్రారంభించాయి.
* సిస్కో బృందంలో
సిస్కో ప్రతినిధుల( Cisco team) బృందంలో ఇప్పాల రవీంద్ర రెడ్డి( ippala Ravindra Reddy ) అనే వ్యక్తి ఉన్నారు. ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా యాక్టివిస్టుగా పనిచేశారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణిలను వ్యక్తిగతంగా కించపరుస్తూ కామెంట్స్ పెట్టేవారు. దారుణాతి దారుణంగా ఆ పోస్టులు ఉండేవి. అటువంటి వ్యక్తి సిస్కోలో ఉన్నత అధికారిగా ఉన్నారు. మూడు రాష్ట్రాల మేనేజర్ గా కొనసాగుతున్నారు. కానీ సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. అటువంటి వ్యక్తి సిస్కో బృందంలో ఉన్నారని లోకేష్ టీం తెలుసుకోకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. సిస్కో బృందంతో నేరుగా లోకేష్ ను కలిసిన ఆయన కరచలనం కూడా చేశారు. దానినే టిడిపి శ్రేణులు ఎక్కువగా జీర్ణించుకోలేకపోతున్నాయి.
* మంత్రి లోకేష్ సీరియస్
అయితే ఈ ఘటనపై మంత్రి లోకేష్ ( Minister Lokesh)సీరియస్ గా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా టిడిపి శ్రేణులు లోకేష్ తీరును తప్పు పట్టడంతో ఆయన అలర్ట్ అయ్యారు. సిస్కో కంపెనీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఒక పార్టీకి సోషల్ మీడియాలో పనిచేసిన వ్యక్తికి సిస్కోలో ఎలా స్థానం ఇచ్చారని ప్రశ్నించారు. గతంలో ఇప్పాల రవీంద్ర రెడ్డి చేసిన కామెంట్స్ ను కూడా వాటికి జత చేశారు. దీనిపై సీరియస్ యాక్షన్ లోకి దిగాలని కోరారు. అటువంటి వ్యక్తిని పెట్టుకొని.. సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని ఘాటుగా లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై సిస్కో ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read : చేతిలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీ : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో లోకేష్ కు తెలుసు*
ఇప్పల రవీంద్రా రెడ్డి అంట !?
ఇతను సిస్కో కంపెనీలో ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక ఏరియా మేనేజర్ గా చేస్తున్నాడు అని తెలిసింది !?అంటే.. అంత హై ప్రొఫైల్ కంపెనీలో హై పొజిషన్ లో వర్క్ చేస్తున్న ఇతను కూడా… గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కి మద్దతుగా & తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా… pic.twitter.com/46O6K6pW5y
— Manchodu Mani (@manchodumani) March 25, 2025