Nara Lokesh Promotion blocked : నారా లోకేష్ కు (Nara Lokesh)టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎందుకు ఇవ్వలేదు? పార్టీలో ఎవరు అడ్డుపడ్డారు? ఎవరి నుంచి అభ్యంతరాలు వచ్చాయి? ఎందుకు ప్రమోషన్ లోకేష్ అందుకోలేకపోయారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. మహానాడు వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తప్పకుండా ఇస్తారని ప్రచారం నడిచింది. అనుకూల మీడియా..చివరకు వ్యతిరేక మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. ప్రమోషన్ తప్పదని చెప్పుకొచ్చాయి. అదిగో చివరి రోజు ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రకటన రాకుండానే మహానాడు వాయిదాపడింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన వాదన వినిపించింది. అసలు లోకేష్ కు పదోన్నతి ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారన్న ప్రశ్న మొదలైంది. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు మదిలో ఏముందో తెలియక టీడీపీ శ్రేణులు సతమతమవుతున్నాయి.
పేరుకే పదోన్నతి కానీ..
ప్రస్తుతం ఎవరు ఔనన్నా కాదన్నా.. టీడీపీ(Telugudesam) బాధ్యతలు నారా లోకేష్ చూస్తున్నారు. మొత్తం పార్టీని భుజస్కందాలపై వేసుకొని మోస్తున్నారు. పార్టీ విధానపరమైన నిర్ణయాలనే చంద్రబాబు తీసుకుంటున్నారు. మిగతా పనులన్నీ లోకేష్ కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఎవరికి పదవులు ఇవ్వాలి…ఎవరికి గుర్తింపునివ్వాలి అనేది లోకేష్ చూసుకుంటున్నారు. అయితే అది సరిపోదని.. ఆయనకు పదోన్నతి ఇవ్వాలని.. పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడుల్లో ఇదే అంశాన్ని తీర్మానించి హైకమాండ్ కు పంపారు. కళా వెంకటరావు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ వరకూ అందరూ ముక్తకంఠంతో కోరుకున్నారు. లోకేష్ కు పదవి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.
Also Read : ‘మహానాడు’ లో నారా లోకేష్ నోట.. అల్లు అర్జున్ మాట..దద్దరిల్లిపోయిన సభ!
ముందుగా పార్టీ బాధ్యతలు..
మొన్న ఆ మధ్యన నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి (Deputy CM) ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి వినిపించింది. అదే సమయంలో జనసేన శ్రేణుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. పవన్ కు సైతం సీఎం హోదా కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో రెండు పార్టీ శ్రేణుల మధ్య ఒక రకమైన వివాదం ఏర్పడింది. దీంతో రెండు పార్టీల నాయకత్వాలు దిద్దుబాటు చర్యలకు దిగాయి. పదవుల విషయంలో బహిరంగ ప్రకటనలు వద్దని ఆదేశాలిచ్చాయి. అప్పుడే లోకేష్ విషయంలో టీడీపీ శ్రేణులు ఒక ప్రతిపాదన చేశాయి. పార్టీపరంగా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. క్రమేపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. అందుకే మినీ మహానాడుల నుంచి ప్రతిపాదలు వెళ్లాయి. మహానాడులో ప్రకటన ఉంటుందని భావించారు.
అడ్డుకున్నది చంద్రబాబే..
అయితే మహానాడులో లోకేష్ ప్రమోషన్ కు సంబంధించి చంద్రబాబు(CM Chandhrababu) అడ్డంకిగా మారినట్టు సమాచారం. ముందుగా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విషయంలో పార్టీలో బలమైన చర్చ జరగాలన్నది చంద్రబాబు అభిప్రాయం.పైగా పార్టీకి అత్యున్నత విభాగం పొలిట్ బ్యూరో ఉంది. అందులో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నింటికీ మించి లోకేష్ తాను నిర్వర్తిస్తున్న విద్యాశాఖలో ప్రక్షాళనలు చేస్తున్నారు. ఆపై ఐటీ విభాగం బాధ్యతలు చూస్తున్నారు. అందుకే అటు పార్టీలో బలమైన చర్చతో పాటు మరికొద్దిరోజులు పోయాక దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావించారట. అందుకే అడ్డుకట్ట వేశారట. సో పార్టీ శ్రేణులకు మాత్రం లోకేష్ విషయంలో చంద్రబాబు నిరాశలో ఉంచేశారు.