Gambhir vs Shreyas Iyer : బుమ్రా, రవీంద్ర జడేజా మినహ మిగతా వారంతా యంగ్ ప్లేయర్లే జట్టులో ఉన్నారు. మొత్తంగా జట్టు ఎంపికలో అజిత్ అగార్కర్ మార్క్ కనిపించినట్టు తెలుస్తోంది. అయితే జట్టులో శ్రేయస్ అయ్యర్ కు చోటు కల్పించకపోవడం సంచలనం కలిగించింది. అయ్యర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అంతకు ముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు.టీమిండియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. అయితే అటువంటి ఆటగాడికి ఇంగ్లీష్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్లో చోటు లభించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. భారత జట్టును ప్రకటించే సమయంలో అజిత్ అగర్కార్ ను విలేకరులు ప్రశ్నిస్తే.. ఏదో కారణాన్ని తెరపైకి చెప్పాడు. జట్టులో స్థానాలు మొత్తం భర్తీ అయ్యాయని.. ఏదో సొల్లు సమాధానం చెప్పాడు. ఇదే విషయాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశ్నిస్తే.. ఆటగాళ్ల ఎంపిక బాధ్యత తనది కాదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంపై టీమ్ ఇండియా మాజీ పేసర్ అతుల్ వాసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Also Read : ఇంత సక్సెస్ ఫుల్ శ్రేయస్ అయ్యర్ ను కాదని గిల్ ను ఎందుకు కెప్టెన్ ను చేసినట్టు?
వాసన్ ఓ ఓటిటి షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు..” గౌతమ్ గంభీర్ ప్లేయర్లను ఎంపిక చేయడు. అతడు కేవలం రిజెక్ట్ మాత్రమే చేస్తాడు. జట్టును ఎంపిక చేసిన మేనేజ్మెంట్.. అయ్యర్ ను జట్టులోకి తీసుకోకపోవడంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదే విషయంపై గౌతమ్ గంభీర్ స్పష్టత ఇస్తే బాగుండేదని” వాసన్ వ్యాఖ్యానించాడు. కోల్ కతా ను గత ఐపిఎల్ సీజన్లో అయ్యర్ విజేతగా నిలిపాడు. నాడు ఆ జట్టుకు మెంటార్ గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గౌతమ్ గంభీర్ – అయ్యర్ మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో అయ్యర్ జట్టు నుంచి బయటికి వచ్చాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ అతడికి, గౌతమ్ గంభీర్ కు అంతంతమాత్రంగానే మాటలు నడిచాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
అయ్యర్ ప్రస్తుత సీజన్లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్ లో ఆకాశమేహద్దుగా చెలదిగిపోతున్నాడు. అ నామకంగా ఉన్న పంజాబ్ జట్టును ఈ స్థాయి దాకా తీసుకొచ్చాడు. ఇటీవల కన్నడ జట్టుతో ఓడిపోయినప్పటికీ.. ధైర్యవచనాలు పలికాడు. తాము మ్యాచ్ మాత్రమే ఓడిపోయామని.. టోర్నీ నుంచి ఇంకా వెళ్లి పోలేదని.. యుద్ధం ఇంకా కొనసాగుతుందని అయ్యర్ వ్యాఖ్యానించాడు. దీనినిబట్టి ముంబై జట్టుతో అతడు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. మొత్తంగా ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని క్రికెట్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.